Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సముద్రఖనికి మాటిస్తున్నా... తమిళం చదవడం నేర్చుకుంటా.. : పవన్ కళ్యాణ్

Advertiesment
bro movie stars
, గురువారం, 27 జులై 2023 (15:47 IST)
తాను కూడా తమిళం చదవడం నేర్చుకుంటానని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు తమిళ దర్శకుడు సముద్రఖనికి ఆయన మాట ఇచ్చారు. బ్రో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, ఈ జీవితం నేను కోరుకున్న జీవితం కాదన్నారు. భగవంతుడు నన్ను ఇలా నడిపిస్తున్నారన్నారు. నటుడిని కావాలని, రాజకీయ నేతను అవ్వాలని నేను ఎన్నడూ ఆలోచన చేయలేదన్నారు. 
 
కొవిడ్ సమయంలో ఈ సినిమా గురించి దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారు. రచయిత, దర్శకుడిని నేను 100 శాతం నమ్ముతా. సముద్రఖని రాసిన మూల కథకు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే అందించారు. మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని అద్భుతంగా రాశారు. సముద్రఖని తమిళనాడుకి చెందినవారు. అయినా తెలుగు భాషపై పట్టు సాధించారు. షూటింగ్ తొలిరోజు చూస్తే ఆయన తెలుగులో స్క్రిప్టు చదువుతున్నారు. ఈ వేదికపై మాటిస్తున్నా. ఆయన తెలుగు నేర్చుకున్నారు కాబట్టి నేను తమిళం నేర్చుకుంటా అని హామీ ఇచ్చారు. 
 
మాతృభాష అయి ఉండి కూడా తెలుగు రాని ఎంతోమందికి సముద్రఖని ప్రయత్నం కనువిప్పు కలిగిస్తుంది. మాతృభాషలో ఉన్నంత బలం వేరే భాషలో ఉండదు. తెలుగు సాహిత్యం విలువని మనం తెలుసుకుంటే గొప్ప సినిమాలు తీయగలం. ఎన్టీఆర్, రామ్ చరణ్ నేను గొప్ప డ్యాన్స్ చేయలేకపోవచ్చు. ప్రభాస్, రానాల బలమైన పాత్రలను పోషించలేకపోవచ్చు. కానీ, సినిమా అంటే నాకు ప్రేమ. సమాజం అంటే బాధ్యత అని అన్నారు. 
 
ఈ చిత్ర పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానికీ చెందింది కాదు. ఇది అందరిది. రాజకీయం కూడా అంతే. మేమంతా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం. స్టార్ డమ్ సాధించిన తర్వాత 'నువ్వు హీరో అవుతావా?' అని అన్నయ్య చిరంజీవి నన్ను అడిగారు. ఆ ప్రశ్నకు నాకు భయమేసింది. ఎందుకంటే నా ఊహలో హీరో అంటే చిరంజీవినే. ఎప్పుడూ నన్ను నేను హీరోగా ఊహించుకోలేదు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ, పొలంలో పనిచేయాలని ఉండేది. మా వదిన నాలో మార్పు తీసుకొచ్చారు. మనల్ని నమ్మేవారు ఒకరుండాలి అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

4 డిగ్రీల సెల్సియస్ ఐస్ బాత్ చేసిన సమంత.. ఎందుకో తెలుసా?