Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 5 March 2025
webdunia

మిల్కీ బ్యూటీతో చిరంజీవి డేటింగ్... "భోళా శంకర్" నుంచి లిరికల్ సాంగ్

Advertiesment
milky beauty
, శుక్రవారం, 21 జులై 2023 (19:42 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "భోళాశంకర్". ఈ చిత్రం వచ్చే నెల 11వ తేదీన విడుదలకానుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. "మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ" అంటూ సాగే ఈ పాట లికికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. మహతి స్వరసాగర్ బాణీలకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మహతి స్వర సాగర్, విజయ్ ప్రకాశ్, సంజన కల్మాంజే ఆలపించారు.
 
ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానరుపై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల 11వ తేదీన విడుదలకానుంది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటించారు. కీర్తి సురేష్ చెల్లి పాత్రను పోషించారు. ఇందులో సుశాంత్, వెన్నెల కిషోర్, తరుణ్ అరోరా, మురళీ శర్మ, శ్రీముఖి, గెటప్ శ్రీను, హైపర్ ఆది తదితరులు నటించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే భోళా మేనియా, జాం జాం జజ్జనక గీతాలు రిలీజ్ కాగా, వీటికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్కి 2989 AD పుట్టింది అక్కడనుంచే: సీక్రెట్ చెప్పిన నాగ్ అశ్విన్