Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భోళా శంకర్ నుంచి గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్ జామ్ జామ్ జజ్జనక విడుదల (video)

Advertiesment
Jam Jam Jajjanaka song
, మంగళవారం, 11 జులై 2023 (17:08 IST)
Jam Jam Jajjanaka song
మెగాస్టార్ చిరంజీవి మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ నుంచి ఒక పాట చిత్రీకరణ జరుగుతుండా ఒక వీడియోను లీక్ చేసారు మెగాస్టార్. ఆ పాట మేకింగ్‌లోని గ్రాండ్‌నెస్ చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు, మేకర్స్ జామ్ జామ్ జజ్జనక  పాటను విడుదల చేశారు.
 
ఇది భోళా శంకర్ గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్. మహతి స్వర సాగర్ పార్టీ, సెలబ్రేషన్ వైబ్‌లను కలిగి ఉన్న పాటని స్వరపరిచారు. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా ఆలాపించారు. కాసర్ల శ్యామ్ మాస్ ని ఆకట్టుకునే లిరిక్స్ అందించారు.  మధ్యలో పాపులర్ ఫోక్ నెంబర్ నర్సపల్లెని మిక్స్ చేయడంతో పార్టీ వైబ్ మరొక స్థాయికి వెళ్ళింది.  
 
చిరంజీవి డాన్స్ మూమెంట్స్ మెస్మరైజింగా వున్నాయి. పాటలో లైవ్లీగా కనిపించారు మెగాస్టార్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో చిరంజీవితో పాటు తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ అలరించారు. సంగీత్, ఇతర వేడుకలకు ఈ పాట ఫస్ట్ ఛాయిస్ గా నిలవనుంది.
 
అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా
 
సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ చిత్రం లియో షూటింగ్ పూర్తి