భోళా శంకర్ డబ్బింగ్ పూర్తయి సురేఖ తో అమెరికా వెళ్లిన చిరంజీవి
, శుక్రవారం, 7 జులై 2023 (14:17 IST)
షూటింగ్ కు ముందు, సినిమా పూర్తి అయ్యాక హీరోలు విదేశాలకు వెళ్లటం మామూలే. మహేష్ బాబు, ప్రబాస్, రాంచరణ్, ఎన్.టి. ఆర్. ఇలా వెళ్ళినవారు. ఇప్పడు చిరంజీవి కూడా చేరాడు. నిన్ననే తన సినిమా భోళా శంకర్ డబ్బింగ్ పూర్తి చేశారు. ఈరోజు యూ.ఎస్. వెళుతున్నట్లు సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్ చేశారు.
నేను నిర్మిస్తున్న నా తదుపరి, సంతోషకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షూట్‌లో చేరడానికి ముందు రిఫ్రెష్, పునరుజ్జీవనం కోసం సురేఖతో కలిసి ఒక చిన్న సెలవుదినం కోసం యుఎస్‌కి బయలుదేరాను అంటూ తెలిపారు.
ఇటీవలే చిరంజీవి మనవ రాలు పుట్టటం, ఆమెకు పేరు పెట్టడం జరిగింది. ఇక భోళా శంకర్ సినిమా చిరంజీవి పుట్టినరోజుకు వారం ముందే విడుదల కాబోతుంది. ఈ సినిమా తమిళ వేదాళం కు రీమేక్. మెహర్ రమేష్ దర్శకుడు.
తర్వాతి కథనం