అమెరికాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు బ్రేకప్ చెప్పిందనే అక్కసుతో 15ఏళ్ల అమ్మాయిని గన్‌తో కాల్చి చంపేశాడు.
అమెరికాలో కొలరాడోకు చెందిన 16 ఏళ్ల బాలుడు జోవానీ సిరియో- కార్డోనా 15 ఏళ్ల లిల్లీ సిల్వా - లోపెజ్ అనే ఇద్దరు ఆరు నెలల నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్నారు. ఆమె లోపెజ్‌కు బ్రేకప్ ఇచ్చింది. దీంతో ఆ బాలుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు.
బాలికను ఎలాగైనా హతమార్చాలని జోవానీ నిర్ణయించుకున్నాడు. లిల్లీ ఇంటికి చేరుకుని తన వెంట తెచ్చుకున్న గన్‌తో కాల్చాడు. చావు బతుకుల మధ్య ఆమె కేకలు వేసింది. లిల్లీ తమ్ముడు పోలీసులకు సమాచారం అందించాడు.
వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే లిల్లీ చనిపోయి కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.