అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని మహారాష్ట్రలో కొనుగోలు చేసి నిజామాబాద్ నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి చెప్పారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	నగరంలోని ఆటోనగర్‌కు చెందిన ఫరీదాబేగం, రషీదాబేగం అనే ఇద్దరు మహిళలు నాందేడ్ జిల్లాలో రూ.11వేలకు గంజాయిని నిజామాబాద్‌కు తరలిస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
									
										
								
																	
	 
	వారి నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు.