మట్కా చిత్రం లో నోరా ఫతేహీను రెట్రో అవతార్‌లో అలరిస్తుంది

డీవీ
గురువారం, 18 జులై 2024 (15:27 IST)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తన పాన్ ఇండియా మూవీ మట్కా కోసం తన బెస్ట్‌ను అందిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న మట్కా వరుణ్ తేజ్‌కి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ.  
 
మట్కా RFCలో కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వింటేజ్ వైజాగ్‌లోని ఎసెన్స్ ని ప్రతిబింబించేలా వింటేజ్ మ్యాసీవ్ సెట్‌లలో షూటింగ్ జరిగింది. చాలా  కీలకమైన సన్నివేశాలు, హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, రెట్రో థీమ్ సాంగ్స్ షూటింగ్ జరిగింది.  
 
మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌ నోరా ఫతేహీను రెట్రో అవతార్‌లో, కలర్‌ఫుల్ పబ్ సెట్‌లో ఎలిగెంట్ పోజులో ప్రజెంట్ చేస్తోంది. నోరా అద్భుతమైన డ్యాన్సర్, మట్కాలోని రెట్రో సాంగ్స్ ఆమెలోని అల్టిమేట్ డ్యాన్స్ ని చూపుతాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ అదిరిపోయే సెట్ లో నెంబర్ అఫ్ డ్యాన్సర్ తో చాలా గ్రాండ్ గా షూట్ చేశారు.
 
ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
 1958 నుంచి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. ఈ మూవీలో చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు.
 
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, వింటేజ్ వైజాగ్ రిక్రియేషన్ హైలైట్‌లుగా ఉంటూ వరుణ్ తేజ్ కెరీర్‌లో 'మట్కా' ఒక మైల్ స్టోన్ మూవీ కాబోతోంది.
 
నటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు
 
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: A కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
పీఅర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments