Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్ ప్రారంభం, సంక్రాంతికి రిలీజ్

Advertiesment
Venkatesh at shooting spot

డీవీ

, గురువారం, 11 జులై 2024 (15:58 IST)
Venkatesh at shooting spot
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌ను పూర్తి చేసేందుకు ముగ్గురూ మూడోసారి కలిసి పనిచేస్తున్నారు. SVC ప్రొడక్షన్ నెం. 58 సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
కొద్ది రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ ప్రారంభమైయింది. ప్యాలెస్‌లో జరుగుతున్న షూటింగ్‌లో సినిమా మెయిన్ కాస్ట్ పాల్గొంటున్నారు. మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియో వర్కింగ్ ఎట్మాస్పియర్ ని చూపిస్తుంది. సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్‌ని సూచించే మ్యాసీవ్ గన్స్ సెట్‌లో చూడవచ్చు.
 
ఈ న్యూ మూవీ హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్ లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్ ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఇన్-ఫార్మ్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్.
 
నటీనటులు: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ బచ్చన్ లోని పాటను జిమ్మిక్ చేస్తున్న హరీశ్ శంకర్