Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

Advertiesment
Venkatesh, Meenakshi Chaudhary clap by allu aravind

డీవీ

, బుధవారం, 3 జులై 2024 (17:55 IST)
Venkatesh, Meenakshi Chaudhary clap by allu aravind
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి వారి కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం. 58 కోసం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండు హిలేరియస్ హిట్‌ల- F2, F3 తర్వాత వారు ఒక ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం ఈ రోజు హైదరాబాద్‌లో అత్యంత గ్రాండ్‌గా ప్రారంభమైంది.
 
ముహూర్తం షాట్‌కు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేయగా, గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
 
ఈ న్యూ మూవీ హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్ లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్ ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ఈ ముగ్గురూ ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించిన నేపథ్యంలో, వారి కాంబినేషన్‌లో మరో చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.
 
ఇన్-ఫార్మ్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ సహ రచయితలు. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్.
 
నటీనటులు: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలయ్య ఫ్యాన్‌గా విశ్వ కార్తికేయ - అమరావతి టూరింగ్ టాకీస్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల