Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మట్కా హ్యుజ్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ కు ఎంటర్ అవుతున్న వరుణ్ తేజ్

Advertiesment
Varuntej- matka shooting

డీవీ

, గురువారం, 11 జులై 2024 (13:20 IST)
Varuntej- matka shooting
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అప్ కమింగ్ పాన్-ఇండియన్ మూవీ "మట్కా"తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైర ఎంటర్టైన్మెంట్స్ డా. విజయేందర్ రెడ్డి తీగల, SRT ఎంటర్టైన్మెంట్స్ రజనీ తాళ్లూరితో కలిసి నిర్మిస్తున్నారు.
 
ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గ్రాండ్ స్కేల్ లో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. సినిమా కోసం నిర్మించిన మ్యాసీవ్ సెట్ లో ప్రస్తుతం ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. సినిమాలో చాలా కీలకంగా వుండే ఈ ఫైట్ సీక్వెన్స్ విజయ్ మాస్టర్ సూపర్ విజన్ లో చాలా మ్యాసీవ్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం వరుణ్ తేజ్ చాలా రిస్కీ స్టంట్స్ పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఈ హైవోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ సినిమాలో ఒక మేజర్ ఎట్రాక్షన్ గా ఉండబోతోంది. 
 
వెర్సటైల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే వరుణ్ తేజ్ 'మట్కా'లో మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు.  
 
దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్ మ్యాసీవ్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. 
 
"మట్కా"కి సినిమాటోగ్రఫీ ఎ. కిషోర్ కుమార్ అందిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను కార్తీక శ్రీనివాస్ ఆర్ హ్యాండిల్ చేస్తున్నారు.  
 
టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్, వింటేజ్ వైజాగ్ రిక్రియేషన్ హైలైట్‌లుగా ఉంటూ వరుణ్ తేజ్ కెరీర్‌లో 'మట్కా' ఒక మైల్ స్టోన్ మూవీ కాబోతోంది. విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ కరుణ కుమార్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 'మట్కా' ఓ మెమరబుల్ మూవీగా వుండబోతోంది.    
 
నటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్ వెనుక పాకెట్ స్టెప్.. రవితేజ, హరీశ్ శంకర్‌పై ట్రోల్స్