Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంజుమ్మెల్ బాయ్స్‌ ఆల్ టైమ్ రికార్డు.. చిన్న సినిమానే కానీ..?

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (23:10 IST)
Manjummel Boys
కేరళ మూవీ మంజుమ్మెల్ బాయ్స్‌ విడుద‌లైన తొలి రోజు నుంచి సంచ‌ల‌న వ‌సూళ్లు సాధిస్తూ అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతోంది. కొన్నేళ్ల కిందట కేరళ నుంచి కొందరు యువకుల బృందం.. కోడైకెనాల్‌ ట్రిప్ వేసింది. 
 
అప్పుడు ఆ గ్రూప్‌లోని ఒకరు గుహలో చిక్కుకుపోయాడు. అతణ్ని అక్కడి నుంచి బయటికి తేవడానికి మిత్ర బృందం ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సినిమాను తీర్చిదిద్దడంతో ప్రేక్షకులకు మాంచి థ్రిల్ ఇస్తోంది. 
 
చిన్న సినిమా అయినా ఆల్ టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మ‌ల‌యాళంలో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. గ‌త ఏడాది వేస‌విలో విడుద‌లై రూ.180 కోట్ల వ‌సూళ్ల‌తో మ‌ల‌యాళంలో ఆల్ టైం బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన 2018 సినిమాను మంజుమ్మెల్ బాయ్స్ అధిగ‌మించింది. 
 
వ‌ర‌ల్డ్ వైడ్ ఈ సినిమా వ‌సూళ్లు రూ.190 కోట్ల‌కు చేరువ‌గా ఉన్నాయి. త్వ‌ర‌లోనే 200 కోట్ల మార్కును కూడా దాటేయ‌బోతోందీ చిత్రం. త‌మిళ‌నాట అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన మ‌ల‌యాళ చిత్రంగా ఈ సినిమా రికార్డు నెల‌కొల్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments