Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు లవ్ స్టీరీస్ ఇష్టం వుండదు కానీ మలయాళీల సినిమాలు బాగుంటాయి : రాజమౌళి

Advertiesment
rajamouli- premalu

డీవీ

, బుధవారం, 13 మార్చి 2024 (14:40 IST)
rajamouli- premalu
కర్నాటక బోర్డర్ నుంచి చెన్నై, తర్వాత హైదరాబాద్ వచ్చి అంతర్జాతీయ గుర్తింపు పొందిన రాజమౌళికి మలయాళీయులతోనూ సంబంధాలున్నాయి. శాంతినివాసం సీరియల్ షూటింగ్ లోవుండగా రైటర్  నన్ను యంద మాషె అని పిలిచేవారు. దాని అర్థం ఏమిటని అంటే..  ఏంటీ బాస్.. అని అర్థం అని చెప్పారు. అలా నా సినిమాలకు ఇతర టెక్నీషియన్స్ పనిచేస్తుంటే యంద యాషె అని పిలుస్తుండేవాడిని. ఓ సారి ఓ రచయితను అలానే పిలిచాను. తనూ యంద మాషె.. అని నన్ను పిలిచాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు అతనికి అనుమానం వచ్చి నన్ను మాషె.. అంటే అర్థం ఏమిటి? అని అడిగాడు.
 
నేను దాని అర్థం బాస్ అని చెప్పాను. తను.. అప్పుడు చెప్పిందేమిటంటే.. మీరు మాషె.. అంటూ నన్ను తిడుతున్నారనుకుని తిరిగి నేను అదే మాట అన్నాను అన్నాడు. సో.. కొన్ని భాషలు ఇలా ఎంటర్ టైన్ చేస్తాయి. ఇక మలయాళీయులతో నాకు మంచి సంబంధాలున్నాయి. వారి కథలు, నటులు గొప్పగా వుంటాయి. ఇక నా సోదరీమణులు మలయాళీలను చేసుకున్నారు. అంటూ మలయాళీయులతో వున్న అనుబంధాలు చెప్పుకొచ్చారు రాజమౌళి.
 
ఈ సందర్బంగా ప్రేమలు అనే సినిమాను ఆయన చూసి అందులో కార్తికేయ చేసిన పెర్ ఫార్మెన్స్ గురించి పొగిడారు. నాకు లవ్ స్టోరీలు ఇష్టం వుండదు. యాక్షన్ సినిమాలంటే ఇష్టం. అయితే ప్రేమలు సినిమా చూశాక బాగా తీశారనిపించింది. అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు- రాజమౌళి కాంబో.. SSMB 29లో ప్రిన్స్ డుయెల్ రోల్?