Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు

డీవీ
శనివారం, 16 మార్చి 2024 (19:17 IST)
Vijay, Mrinal, Parashuram
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. మూవీ టీమ్ గుమ్మడికాయ కొట్టేశారు. ఫ్యామిలీ స్టార్ షూట్ కంప్లీట్ అని చెబుతూ మేకర్స్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో మృణాల్, విజయ్, పరశురామ్ పెట్ల ఒకరినొకరు అఫెక్షన్ తో హగ్ చేసుకుంటున్న క్లిప్ ఉంది. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్"  సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన లిరికల్ సాంగ్స్, టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. "ఫ్యామిలీ స్టార్" సమ్మర్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే నమ్మకం ఈ పాజిటివ్ వైబ్స్ తో ఏర్పడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments