Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్యాణి వచ్చా వచ్చా.. సాంగ్ కు ఎనర్జిటిక్ గా డాన్స్ చేసి మెప్పించిన మంగ్లీ

Advertiesment
mangli

డీవీ

, గురువారం, 14 మార్చి 2024 (16:40 IST)
mangli
సింగర్ మంగ్లీ జానపదపాటలకు పెట్టింది పేరు. కమర్షియల్ పాటలకు తనదైన శైలిలో రాణిస్తోంది. తాజాగా తాను పాడిన పాటకు డాన్స్ చేస్తూ ఇన్ స్ట్రాలో అభిమానులను ఫిదా చేసింది. హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా నుంచి సెకండ్ సింగిల్  'కళ్యాణి వచ్చా వచ్చా..' రిలీజైంది.

webdunia
Mangli dance
వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా...మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా పాడారు. గోపీ సుందర్ మంచి డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.
 
webdunia
Mangli dance
కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా..ధమకు ధమా ధమారి, ఛమకు ఛమా ఛమారి, సయ్యారి సరాసరి మొదలుపెట్టే సవారి, డుమకు డుమా డుమారి, జమకు జమా జమారి, ముస్తాభై ఉన్నామని అదరగొట్టేయ్ కచేరి....' అంటూ పెళ్లి సందడిని రెట్టింపు చేసేలా సాగిందీ పాట. "ఫ్యామిలీ స్టార్" సినిమాలో ఈ పాట కలర్ ఫుల్ గా ఉండబోతోంది.  ఇటువంటి పాట రావడం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని మంగ్లీ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమాలో సందేశం మంచిదైతే ప్రేక్షకులు ఆదరిస్తారు : వెంకయ్యనాయుడు