Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమాలో సందేశం మంచిదైతే ప్రేక్షకులు ఆదరిస్తారు : వెంకయ్యనాయుడు

Advertiesment
Venkaiah Naidu launched The 100 First Look

డీవీ

, గురువారం, 14 మార్చి 2024 (16:19 IST)
Venkaiah Naidu launched The 100 First Look
మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్, రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో 'ది 100' అనే కొత్త చిత్రంతో రాబోతున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంచ్ చేశారు. మోషన్‌ పోస్టర్‌ లాంచ్ కు ముందు ఈ సినిమాని వెంకయ్యనాయుడు గారు వీక్షించారు.  
 
ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్‌ లో ఆర్కే సాగర్  విక్రాంత్ ఐపీఎస్ గా పరిచయం అయ్యారు. ఖాకీ దుస్తులు ధరించి, చేతిలో తుపాకీతో కనిపించారు. స్పోర్టింగ్ షేడ్స్, అతని ముఖంలో ఇంటన్సిటీ ని గమనించవచ్చు. మోషన్ పోస్టర్ నెంబర్ 100 యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. "ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఇది ఒక ఆయుధం" అని క్లిప్‌లో చూపబడింది. మిషా నారంగ్ కథానాయికగా నటిస్తుండగా, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ టెక్నీషియన్లు ఈ సినిమాలో పని చేస్తున్నారు. శ్యామ్ కె నాయుడు డీవోపీ గా పని చేస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్. చిన్నా ప్రొడక్షన్‌ డిజైనర్‌. ఆర్కే సాగర్ ఇంటెన్స్ పోలీస్ గా కనిపించనున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ పేరిచర్ల డైలాగ్స్ రాస్తున్నారు.
 
మోషన్ పోస్టర్‌ లాంచింగ్ ఈవెంట్ లో మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సినిమా అనేది శక్తివంతమైన ఆయుధం. సినిమా ప్రభావం సమాజంపై వుంటుంది. 'ది 100' చిత్ర ఇతివృత్తం చాలా బావుంది. సినిమా చిత్రీకరణ కూడా చాలా బావుంది. సినిమాలో చాలా మంచి సందేశం వుంది. ఇంత చక్కటి సినిమాని రూపొందించిన నిర్మాతలకు, దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ కు, కథానాయకుడు సాగర్ కు అభినందనలు. ఈ సినిమా విజయవంతగా నడుస్తుంది. ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారనే విశ్వాసం వుంది. నటుడిగా సాగర్ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ అధికారి సాగర్ లానే వుండాలానే అభిప్రాయం కలుగుతుంది. పాత్రలో లీనమై చాలా హుందాగా కనిపించారు. ఇందులో వున్న సందేశం నాకు చాలా నచ్చింది.  సినిమా ఎప్పుడూ సందేశాన్ని అందించాలి. ఆ సందేశం మంచిదైతే ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆదరిస్తారు. ఎలాంటి అసభ్యత లేకుండా చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా అన్ని విధాలా విజయవంతం కావాలని కోరుకుంటూ సినిమా బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను'' అన్నారు.  
 
హీరో ఆర్కే సాగర్‌ మాట్లాడుతూ.. ఒక సినిమా చేస్తే సంతోషం కాదు గర్వం వుంటుంది. అలాంటి గౌరవాన్ని ఇచ్చిన సినిమా 'ది 100'. ఈ వేడుకు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు రావడం మా అదృష్టం. చాలా గర్వంగా వుంది. ఆయనకి  సినిమా చూపించి నాలుగు మాటలు ఆ సినిమా గురించి మాట్లాడించం నా కల. ఆ కల నిజంగా నెరవేరింది. ఆయనకు రణపడి వుంటాను. నిర్మాతలు  రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, తారక్ రామ్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు. దర్శకుడు శశి నేను మంచి స్నేహితులం. తను అద్భుతమైన దర్శకుడు. భవిష్యత్ లో ఇంకా మంచిమంచి చిత్రాలు తీస్తాడని కోరుకుంటున్నాను. సుదీర్ వర్మ గారి డైలాగ్స్ చాలా బావున్నాయి. 'ది 100' అనేది ప్రతి మనిషి జీవితంలో ఈ ఆయుధం అవసరం వస్తుంది. ఇది ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీస్ ఖచ్చితంగా చుస్తారనే నమ్మకం వుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి నేపధ్య సంగీతం ఇచ్చారు. నటీనటులంతా చక్కగా నటించారు. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది'' అన్నారు.
 
దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ.. ఈ వేడుకు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు రావడం మా అదృష్టం. ఆయన ప్రోత్సాహం మాకు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాం. 'ది 100' ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. సహజంగా ఉంటూనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక సోషల్ ఇష్యూని చెప్పడం జరిగింది. అందరూ చూడదగ్గ సినిమా ఇది. అందరూ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.  నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన సాగర్ గారికి ధన్యవాదాలు. నిర్మాతలకు కృతజ్ఞతలు.  'ది 100' అనేది వెపన్. అది పూర్తిగా తెలియాలంటే అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడాలి. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది' అన్నారు,
 
నిర్మాత రమేష్ కరుటూరి మాట్లాడుతూ.. శ్రీ వెంకయ్య నాయుడు గారు లాంటి మహావ్యక్తి మా సినిమా చూడటానికి రావడం చాలా ఆనందంగా వుంది. ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ ధన్యవాదాలు' తెలిపారు . చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ విలన్ గా నటించిన యమధీర టీజర్ లాంచ్ చేసిన నిర్మాత అశోక్ కుమార్