Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎక్కడ కళాకారులు గౌరవించిబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది: మెగాస్టార్ చిరంజీవి

chiru satkaram with telangana prabhutyam

డీవీ

, సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (08:02 IST)
chiru satkaram with telangana prabhutyam
తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా ఇస్తానని చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలను హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విఠలాచార్యలకు సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.25లక్షల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. 
 
webdunia
All padma awardees
గద్దర్ పేరుతో అవార్డులు ఎంతో సముచితం..
 ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కొంతకాలంగా నంది అవార్డులు గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తనను చాలా నిరుత్సాహపరిచిందని తెలిపారు. కానీ నంది అవార్డుల పేరును గద్దర్‌ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని చెప్పారు. గద్దర్‌ అవార్డులను త్వరలోనే తెలంగాణ  ప్రభుత్వం ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడ కళాకారులు గౌరవించిబడుతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. పద్మభూషణ్‌ అవార్డు వచ్చినప్పుడు ఆనందం పద్మవిభూషణ్ అప్పుడు రాలేదన్నారు. కానీ తోటి కళాకారులు, ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలిపినప్పుడు ఎంతో ఉద్వేగానికి గురయ్యానని తెలిపారు. అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం మీ కరతాళధ్వనుల ద్వారా లభించిందని.. అది చూసిన తర్వాత ఈ జన్మకు ఇది చాలు అనిపించిందని చిరు భావోద్వేగానికి గురయ్యారు.
 
ఆ ఉద్దేశంతోనే బ్లడ్ బ్యాంకులు ఏర్పాటుచేశా..
 
థియేటర్ల దగ్గర కటౌట్లు, బ్యానర్లకు పాలాభిషేకాలు అంటూ అభిమానుల శక్తి దుర్వినియోగం కాకూడదనే బ్లడ్‌ బ్యాంకులు ఏర్పాటు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. అభిమానులు ప్రాణం ఇస్తామంటారు.. కానీ ప్రాణం వద్దు.. రక్తం ఇవ్వండ అనే నినాదంతో బ్లడ్‌ బ్యాంకులు ప్రారంభించానని వివరించారు. దీంతో ప్రతి వేడుకలో రక్తదానం చేయడానికి ప్రజలు ముందుకొస్తున్నారని.. దీనికి పునాది వేసింది తాను, తన ఫ్యాన్స్ అని చెప్పేందుకు గర్వపడుతున్నానని తెలిపారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు, కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంకు లాంటి సేవా కార్యక్రమంలు చేయడానికి తనకు అభిమానులు చాలా సహకరించారని చిరు గుర్తుచేసుకున్నారు. 
 
కాగా అంతకుముందు శనివారం రాత్రి మెగాస్టార్ ఇంట్లో సినీ, రాజకీయ ప్రముఖులకు ఉపాసన సమక్షంలో చిరంజీవికి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
దుర్భాషలతో రాజకీయాలు దిగజారిపోతున్నాయి..
ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హుందాగా రాజకీయాలు చేసేవారని కొనియాడారు. దివంగత ప్రధాని వాజ్‌పేయీకు ఉన్నంత  హుందాతనం ఆయనలో ఉందన్నారు. కానీ రాజకీయాల్లో రాను రాను దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలతో దిగజారపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాల్లో మార్పు రావాలని వెంకయ్య తనతో చెప్పేవారని.. ఆ మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.  కానీ ఆ విమర్శల ధాటికి తట్టుకోలేకపోయానని.. అందుకే దూరంగా వచ్చానని తెలిపారు. దుర్భాషలాడే నేతలకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ కలిసి నటించాలనుకుంటున్నాం : రవితేజ