Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ చిరంజీవి కోసం యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్న రామ్ లక్ష్మణ్

Advertiesment
Vashishta Chota K. Naidu and others

డీవీ

, మంగళవారం, 30 జనవరి 2024 (18:05 IST)
Vashishta Chota K. Naidu and others
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా విశ్వంభర షూట్ కోసం సిద్ధమవుతున్నారు. త్వరలో ఆయన పై యాక్షన్ ఎపిసోడ్స్ తీయనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ చిత్ర టీమ్ గ్రూప్ ఫొటో పోస్ట్ చేసింది. దర్శకుడు వశిష్ట తెరకెక్కించనున్న ఈ సినిమా మానవీత శక్తుల నేపథ్యంలో వుండబోతుంది. ఈ సినిమాకోసం ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్, సినిమాటో గ్రాఫర్ ఛోటా కె.నాయుడు టీమ్ తో చర్చలు జరుపుతున్నారు.
 
ఛోటా కె.నాయుడు చాలా కాలం తర్వాత మెగాస్టార్ సినిమాకు పనిచేయడం విశేషం. అప్పట్లో ఆయన సినిమాలన్నింటికీ ఛోటా కె.నాయుడు కెమెరా మెన్ గా వుండేవాడు. కొన్ని కారణాలవల్ల బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మరలా చిరంజీవితో కలిసి పనిచేయడం చెప్పలేని ఆనందంగా వుందని తెలియజేస్తున్నారు. 
 
విశ్వంభర లో సహజంగా ఫైట్ సీక్వెన్స్‌ల కోసం ప్రముఖ యాక్షన్ దర్శకులు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్‌తో యాక్షన్ కొరియోగ్రఫీ చర్చలు ప్రారంభించారు. ఇవి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలియజేస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తోంది. త్వరలో చిరంజీవి ఎప్పుడు సెట్ కు వెళ్ళనున్నారో తెలియనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవితేజ ఈగిల్ కోసం ఊరు పేరు భైరవకోన విడుదల వాయిదా