Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

Advertiesment
Vishvambhara glimp

డీవీ

, బుధవారం, 17 జనవరి 2024 (09:22 IST)
Vishvambhara glimp
మెగాస్టార్ చిరంజీవి గత సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో తన అభిమానులకు, ప్రేక్షకులకు ఫుల్ మీల్ ఫీస్ట్ అందించారు. మెగాస్టార్‌కు ఈ సంవత్సరం పండుగకు థియేట్రికల్ రిలీజ్ లేనప్పటికీ మెగాస్టార్ మాగ్నమ్ ఓపస్ #Mega156 మేకర్స్ సినిమా టైటిల్‌ను స్పెల్‌బైండింగ్ గ్లింప్స్ ను లాంచ్ చేయడం ద్వారా పర్ఫెక్ట్ సంక్రాంతి ప్రజంటేషన్ అందించారు.
 
గ్లింప్స్ మనల్ని అద్భుత ప్రపంచంలోకి తీసుకెళుతుంది. అక్కడ ఎవరో మ్యాజికల్ బాక్స్ ని లాక్ చేస్తారు, అది అనుకోకుండా పడిపోయింది. ఇది బ్లాక్ హోల్ గుండా వెళుతుంది. ఒక గ్రహశకలం లోకి క్రాష్ అవుతుంది. అటువంటి అనేక ఆటంకాలు అడ్డంకులు తర్వాత, ఆ మ్యాజికల్ బాక్స్  చివరకు భూమికి చేరుకుంటుంది. ఇది ఒక పెద్ద హనుమాన్ విగ్రహంతో సింబాలిక్ గా చూపించారు. ఒక బిలం భూమిపైకి దూసుకువస్తుంది. అయినప్పటికీ మ్యాజిక్ బాక్స్‌కు ఏమీ జరగదు. చివరి గా ఈ చిత్రం టైటిల్  'విశ్వంభర' గా రివిల్ అవుతుంది.
 
మెగా మాస్ బియాండ్ ది యూనివర్స్ అనేది మన ఊహలకు అందనిది, మ్యాజికల్ బాక్స్  ప్రయాణం మనం చూడబోయే గొప్ప సినిమా అనుభవంపై కొంత స్పష్టతను ఇస్తుంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ అత్యున్నతంగా వుంది. మరీ ముఖ్యంగా 'విశ్వంభర' అనే టైటిల్ చాలా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది.
 
బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవికి కాస్ట్లీయస్ట్  చిత్రంగా నిలుస్తోంది.
 
ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
 
కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్లిరిక్ రైటర్స్.  శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా ఉన్నారు.
 
సినిమా షూటింగ్ ఇనీషియల్ స్టేజ్ లో వుంది. 2025 సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్, డైరెక్టర్ మారుతి చిత్రం రాజా సాబ్ ఫస్ట్ లుక్