Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2024లో మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడినే అంటున్న PK, కేంద్రమంత్రిగా మెగాస్టార్ చిరు?

Narendra Modi and Chiranjeevi

ఐవీఆర్

, మంగళవారం, 30 జనవరి 2024 (13:37 IST)
కర్టెసి-ట్విట్టర్
మరో రెండుమూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తిరిగి ఎన్డీయే అధికారం చేజిక్కించుకుంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తరాది నుంచి అత్యధిక స్థానాలు భాజపా కైవసం చేసుకోబోతోందని ఆయన వెల్లడించారు. ఇక దక్షిణాది విషయానికి వస్తే.. కర్నాటలో కాస్తోకూస్తో భాజపా ప్రభావం చూపించే స్థితిలో వుంది.
 
కానీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆ పార్టీ పుంజుకుని సీట్లు రాబట్టేందుకు తగిన నాయకులు లేరు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మెగా పాపులారిటీ వున్న మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకి పంపాలని బీజేపి పెద్దలు యోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనను బీహార్ నుంచి రాజ్యసభకి పంపాలని యోచిస్తున్నట్లు చెపుతున్నారు. ఇప్పటికే అయోధ్యకి మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఆహ్వానించారు. అలాగే ఆయనకు ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు.
 
రాజ్యసభకి పంపడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని కాపు సామాజిక వర్గం ఓట్లను రాబట్టుకోవచ్చని ఆలోచన చేస్తున్నట్లు సమచారం. ఇప్పటికే ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతోంది భాజపా. ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో సీట్లను రాబట్టుకునేందుకు ఈసారి భాజపా భారీ కసరత్తు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకి పంపడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, ఆ తర్వాత ఏర్పాటు చేసే ప్రభుత్వంలో చిరుకి కేంద్రంలో మంత్రిగా ఇచ్చే అవకాశం వుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఐతే, రాజకీయాలకు తను దూరంగా వుంటానని గతంలో చిరంజీవి ప్రకటించారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థులను కాదు.. ముఖ్యమంత్రి మమతను చెంప దెబ్బలు కొట్టాలి : బెంగాల్ చీఫ్