Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్యార్థులను కాదు.. ముఖ్యమంత్రి మమతను చెంప దెబ్బలు కొట్టాలి : బెంగాల్ చీఫ్

mamata - sukanta

వరుణ్

, మంగళవారం, 30 జనవరి 2024 (13:19 IST)
విద్యార్థులు చదువుల్లో రాణించలేకపోవడం వారి తప్పుకాదని, విద్యావ్యవస్థను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భ్రష్టు పట్టించారని, అందువల్ల ఆమె చెంపలు పగులగొట్టాలని భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బెంగాల్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సీఎం మమతా బెనర్జీ భ్రష్టుపట్టించారని ఆరోపించారు. మన పిల్లలు చదువుల్లో రాణించకపోవడం వారి తప్పు కాదన్నారు. తల్లిదండ్రులు పిల్లన్ని కొట్టడానికి బదులు ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెంపలు పగులగొట్టాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుకాంత మజుందరా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. 
 
మరోవైపు, సుకాంత చేసిన వ్యాఖ్యలపై అధికార టీఎంసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టి, భౌతిక దాడులకు ఆయన ప్రేరేపిస్తున్నారంటూ ఆరోపించారు. తక్షణం సీఎం మమతతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి ఆయన క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ సుకాంత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాగా, సుకాంత వ్యాఖ్యలకు నిరసనగా టీఎంసీ మహిళా విభాగం మంగళవారం రాజధాని కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ నార్సింగ్‌లో డ్రగ్ కలకలం.. ఆ హీరో ప్రియురాలు అరెస్టంటూ వార్తలు...