Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

ఫ్లైట్ ఆలస్యం.. కెప్టెన్‌పై దాడి చేసిన ప్రయాణీకుడు

Advertiesment
Passenger

సెల్వి

, మంగళవారం, 16 జనవరి 2024 (09:25 IST)
Passenger
ఢిల్లీ విమానాశ్రయంలో ఫ్లైట్ ఆలస్యం అవుతుందని ఫ్లైట్ కెప్టెన్‌ ప్రకటన చేస్తుండగా ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. కెప్టెన్‌పై దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. ఇతనిని ఫ్లైట్ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రయాణీకుడి చర్యకు అసహనం వ్యక్తం చేశారు. 
 
ఇంతలో తోటి ప్రయాణీకుడు దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని వెనక్కి తీసుకెళ్లాడు. ఇంకా ఫ్లైట్ సిబ్బందికి క్షమాపణలు చెప్పాడు. అయితే ఫ్లైట్ ఢిల్లీలో దిగగానే దురుసుగా ప్రవర్తించిన ప్రయాణీకుడికి షాక్ తప్పలేదు. నిందితుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పహారీ భాషలో రామ్ భజనను ఆలపించిన ముస్లిం యువతి