రచయిత, దర్శకుడు అయిన చిన్ని క్రిష్ణ కెరీర్ ఒక దశలో పీక్ స్టేజీకి వెళ్ళింది. చిరంజీవి ఇంద్ర సినిమాకు ఆయనే కథారచయిత. ఆ సినిమా తర్వాత చిన్ని క్రిష్ణ చాలాకాలం గేప్ తీసుకున్నారు. వ్యక్తిగత కారణాలు కూడా తోడుకావడంతో ఇండస్ట్రీకి దాదాపు దూరమయ్యారు. తాజాగా మళ్ళీ కొత్త కథలు రాసేపనిలో వున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి పద్మవిభూషణ్ అవార్డు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన వాణిని ఈ విధంగా తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవిగారిని కలిసి వచ్చాను. ఆయన నన్ను ఆదరించిన తీరు మర్చిపోలేకపోతున్నాను. ఇంద్ర సినిమా టైంలో కొందరి ప్రోద్బలంతో చిరంజీవిగారిని విమర్శించాల్సి వచ్చింది. అప్పుడు నా భార్య, సోదరి, బావ, కుటుంబీకులు కూడా నాతో గొడవపడ్డారు.అప్పుడు నాకు ఇంద్ర వంటి సినిమాను ఇచ్చి ప్రోెత్సహించారు. నేడు చిరంజీవిగారిని కలిసినప్పుడు క్షమాపణలు చెప్పాను. ప్రతి మనిషి ఏదో సందర్భంగా తప్పు చేస్తాడు. అలాగే నేను చేశాను.
నేను క్షమించని అడిగితే. ఆయన నీమీద నాకు కోపం లేదు అంటూ.. నా పిల్లలు భవిష్యత్ గురించి అడిగారు. అలాగే మంచి కథ వుంటే రాయమని చెప్పారు. తప్పకుండా రాస్తాను. ఈసారి కథ రాస్తే భారత్ దేశం గర్వించేదిలా వుంటుందని చెప్పాను. అంటూ చిన్ని క్రిష్ణ తన మనసులోని విషయాన్ని ఆవిష్కరించారు.