Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను పొగడకపోయినా పర్లేదు.. తక్కువ చేసి మాట్లాడొద్దు: ప్రియా ప్రకాష్ వారియర్

సోషల్ మీడియా ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీగా మారిపోయిన ఒరు ఆదార్ లవ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. తాజాగా కేరళ వరద బాధితులకు తన వంతు సాయం అందించింది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ పాటకు

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (18:18 IST)
సోషల్ మీడియా ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీగా మారిపోయిన ఒరు ఆదార్ లవ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. తాజాగా కేరళ వరద బాధితులకు తన వంతు సాయం అందించింది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ పాటకు కన్నుగీటుతూ.. యూత్ అందరినీ ఆకట్టుకున్న ప్రియా ప్రకాష్ వారియర్.. మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం కేరళ వరద బాధితులకు సాయం అందిస్తూ.. ట్విట్టర్లో ఓ సందేశాన్ని రాసింది. 
 
పబ్లిసిటీ కోసం ఇలా చేశానని అనుకోవద్దని వేడుకుంది. ఓనం పండుగ సందర్భంగా తాను రాష్ట్రం కోసం చేయగలిగింది చేశాను. మాటలు చెప్పడం కంటే చేతల్లో చేస్తే.. ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని అనిపిస్తుంది. తాను పబ్లిసిటీ కోసం విరాళం ఇవ్వలేదు. మేం ఎంత విరాళం ఇచ్చామో తెలిస్తే.. అప్పుడు ప్రజలు దాన్ని సక్రమంగా వినియోగించుకుంటారు. అందుకే చెప్తున్నాను. 
 
ఈ విషయంలో తనను ప్రశంసించకపోయినా పర్లేదు కానీ.. తక్కువ చేసి మాట్లాడకండి అంటూ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్‌తో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలు విరాళం అందించినట్లు ఉన్న లేఖను ప్రియా ప్రకాష్ వారియర్ షేర్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments