Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకృతి ప్రకోపం కాదు.. తమిళనాడే మా కొంప ముంచింది : కేరళ వాదన

తమ రాష్ట్రం వరద నీటిలో మునిగిపోవడానికి ప్రధాన కారణం తమిళనాడు రాష్ట్రమని కేరళ సర్కారు ఆరోపిస్తోంది. ఇదే అంశంపై కోర్టులో ఒక పిటిషన్‌ను కూడా దాఖలు చేయనుంది. ఇటీవల సంభవించిన ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట

ప్రకృతి ప్రకోపం కాదు.. తమిళనాడే మా కొంప ముంచింది : కేరళ వాదన
, శుక్రవారం, 24 ఆగస్టు 2018 (10:49 IST)
తమ రాష్ట్రం వరద నీటిలో మునిగిపోవడానికి ప్రధాన కారణం తమిళనాడు రాష్ట్రమని కేరళ సర్కారు ఆరోపిస్తోంది. ఇదే అంశంపై కోర్టులో ఒక పిటిషన్‌ను కూడా దాఖలు చేయనుంది. ఇటీవల సంభవించిన ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెల్సిందే. ముఖ్యంగా, రాష్ట్రంలోని 14 జిల్లాలు నీట మునిగాయి. వారం పది రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభవృష్ణికి కేరళ వరద నీటిలో మునిగిపోయింది.
 
అయితే, కేరళ మాత్రం తమ రాష్ట్రం వరద నీటిలో మునగిపోవడానికి ప్రకృతి ప్రకోపం కాదని వాదిస్తోంది. తమ రాష్ట్రంలో వరదలకు పొరుగునున్న తమిళనాడే కారణమని ఆరోపిస్తోంది. పురాతన ముల్లై పెరియార్ రిజర్వాయర్ నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా ఇడుక్కి డ్యామ్‌లో చేరిందని కేరళ వాదిస్తోంది. దీంతో ఈ నెల 15న ఇడుక్కి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో కేరళను వరద ముంచెత్తిందని ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
తమిళనాడు ప్రజలకు నీటిని అందించాలన్న ఉదాత్త లక్ష్యంతో శతాబ్దంన్నర క్రితం ముల్లై పెరియార్ ప్రాజెక్టును కేరళలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తమిళనాడే చూసుకుంటోంది. పెరియార్ ప్రాజెక్టును నిర్మించి 150 ఏళ్లకు పైగా కావడంతో దానిని కూల్చివేసి కొత్తది నిర్మించాలని కేరళ డిమాండ్ చేస్తోంది. 
 
అలాగే, డ్యామ్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 142 నుంచి 139 అడుగులకు తగ్గించాలని కోరుతోంది. కానీ కేరళ విజ్ఞప్తిని తమిళనాడు తోసిపుచ్చుతోంది. పైగా, ఇదే వ్యవహారంపై న్యాయ పోరాటం కూడా చేశాయి. ఇక్కడ తమిళనాడుకు అనుకూలంగానే కోర్టు తీర్పు వచ్చింది. దీంతో 142 అడుగుల మేరకు నీటిని నిల్వ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా మొగుడు నిద్రపోయాడు.. ఎక్కడకు రమ్మంటావ్ : ఊరి బయటవుండే పత్తితోటలోకి వచ్చెయ్..