Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళ వరద బాధితులకు ఎమిరేట్స్ సాయం అందిస్తే తీసుకోవచ్చు.. తప్పేమీలేదు..

కేరళ రాష్ట్రం వరదలో మునిగిపోయింది. వరద తాకిడితో కకావికలమైన కేరళ రాష్ట్రానికి విదేశాలు అందించే ఆర్థిక సాయానికి కేంద్రం తిరస్కరించింది. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు దేశీయ సంస్థలతోపాటు పలు దేశాలు సాయం

కేరళ వరద బాధితులకు ఎమిరేట్స్ సాయం అందిస్తే తీసుకోవచ్చు.. తప్పేమీలేదు..
, గురువారం, 23 ఆగస్టు 2018 (16:37 IST)
కేరళ రాష్ట్రం వరదలో మునిగిపోయింది. వరద తాకిడితో కకావికలమైన కేరళ రాష్ట్రానికి విదేశాలు అందించే ఆర్థిక సాయానికి కేంద్రం తిరస్కరించింది. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు దేశీయ సంస్థలతోపాటు పలు దేశాలు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఏకంగా రూ.700 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 
 
థాయ్‌లాండ్‌తోపాటు మరికొన్ని దేశాలు ముందుకు వచ్చినా కేంద్రం సున్నితంగా తిరస్కరించింది. 2004 సునామీ సందర్భంగా.. ఉత్తరాఖండ్ వరదల సమయంలోనూ విదేశీ సాయానికి కేంద్రం నో చెప్పింది. ఇందుకు కారణం.. దశాబ్ధ కాలంగా అనుసరిస్తున్న విధానమే. కేంద్రం విదేశాల ఆర్థిక సాయం వద్దని చెప్పడం.. సంఘీభావం చాలని తెలపింది. కానీ.. కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ దీనిపై మరోలా స్పందించారు. 
 
ఎమిరేట్స్‌ అభ్యున్నతిలో కేరళీయుల పాత్ర ఎంతో ఉంది. వారిచ్చిన సాయాన్ని తీసుకోవడంలో తప్పులేదని చెప్తున్నారు. ఇతర దేశాలతో యూఏఈ పోల్చాల్సిన అవసరం లేదన్నారు. విపత్తు సమయంలో ఏ దేశమైనా స్వచ్ఛందంగా ఇచ్చే సాయాన్ని తీసుకోవచ్చని జాతీయ విపత్తు నిర్వహణ విధానం (ఎన్‌డీఎంపీ)కు 2016లో చేసిన సవరణను కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐసాక్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేరుకు మాత్రమే టీచర్.. కానీ భార్యను వదిలిపెట్టి.. ప్రియురాలితో సంసారం