Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరద ముంపులోనే శబరిమల.. ఇళ్లల్లోకి బురద, మొసళ్లు, పాములు

కేరళను వరదలు ముంచేశాయి. కేరళలో పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా కేరళ జలమయమైంది. ఈ జల ప్రళయంలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కేరళ రాష్ట్రమంతటినీ రాష్ట్రమం

వరద ముంపులోనే శబరిమల.. ఇళ్లల్లోకి బురద, మొసళ్లు, పాములు
, బుధవారం, 22 ఆగస్టు 2018 (15:45 IST)
కేరళను వరదలు ముంచేశాయి. కేరళలో పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా కేరళ జలమయమైంది. ఈ జల ప్రళయంలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కేరళ రాష్ట్రమంతటినీ రాష్ట్రమంతటినీ అల్లకల్లోలం చేసిన నదులు, ఇప్పుడు కాస్తంత శాంతించినా, పంబా నది మాత్రం ఉగ్రరూపాన్ని ఇంకా వీడలేదు. 
 
కాక్కి రిజర్వాయర్ లోకి కొండ ప్రాంతాల నుంచి భారీగా నీరు వస్తుండటంతో, శబరిమల ఇంకా వరద ముంపులోనే ఉంది. శబరిమల దిగువన పంబా నది దాదాపు 20 అడుగుల ఎత్తులో ప్రవహిస్తూ ఉండటంతో, నది దాటే మార్గం ఇంకా తెరచుకోలేదు. దీంతో భక్తులు ఎవరూ శబరిమలకు రావద్దని అధికారులు కోరుతున్నారు. వస్తున్న భక్తులను నది ముందు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. కేరళలో వరదలు తగ్గుముఖం పట్టాయి. అయితే వరదల్లో మునిగిపోయిన ఇళ్లలోకి  పాములు, మొసళ్లు వచ్చి చేరాయి. అంతేకాదు వరదల కారణంగా ఇళ్లలోకి బురద వచ్చి చేరింది. ఇంకా చాలా గ్రామాలు వరద నీటిలోనే మునిగిపోయాయి. సుమారు రెండు లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. 
 
వరదలు తగ్గుముఖం పట్టడంతో పునరావాస శిబిరాల నుండి ప్రజలు తమ ఇళ్లకు చేరుకొంటున్నారు. అయితే  ఇళ్లలో బురద మట్టి పేరుకుపోయింది. వరదనీటిలోనే రోజుల తరబడి ఉన్న కారణంగా పాములు , మొసళ్లు ఇళ్లలోకి చేరాయి. అయితే తమ ఇళ్లలోకి వచ్చిన జనం  పాములతో భయబ్రాంతులకు గురౌతున్నారు. 
 
త్రిసూర్ జిల్లాలోని చాలక్కూరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వరదలో ఉన్న తన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లాడు.ఇంటికి వెళ్లిన అతను షాక్‌కు గురయ్యాడు. ఇంట్లో మొసలిని చూసి ఆ వ్యక్తి  షాక్ తిన్నాడు. వెంటనే స్థానికులను తీసుకొని వచ్చాడు. తన  ఇంట్లోని వరద నీటిలో ఉన్న మొసలిని బంధించాడు. ఆ మొసలిని సమీపంలోని  చెరువులో వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహేతర సంబంధం.. వద్దమ్మా అన్నాడు.. అంతే కన్నకొడుకునే చంపేసింది..