Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేజర్ పాత్ర గ‌ర్వంగా వుందంటున్న అడవి శేషు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (14:14 IST)
క్ష‌ణం, గూఢచారి, ఎవ‌రు వంటి భిన్న‌మైన కాన్సెప్ట్‌తో ముందుకు వ‌చ్చిన అడ‌విశేషు.. ఈసారి 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గా క‌న్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ధైర్య‌సాహ‌సాల‌కు పెట్టింది పేరు. అందుకే ఆయ‌న స్టిల్‌ను అడ‌విశేషు త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గురువారంనాడు విడుద‌ల చేశారు.
 
నిస్వార్థప‌రుడు, ధైర్యవంతుడు మ‌నంద‌రికీ ఎంతో ఇష్ట‌మైన‌ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గా న‌టించ‌డం ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని అడ‌విశేషు తెలియ‌జేస్తున్నారు. అందుకు త‌గిన విధంగా రైఫిల్ షూటింగ్ చేస్తున్న స్టిల్‌ను ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు `మేజర్` ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌.
 
26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌కుకి అందించ‌డ‌మే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం. అతడు వీర మ‌ర‌ణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తోంది చిత్ర యూనిట్‌.
 
27/11న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వ‌ర్ధంతి సందర్భంగా హీరో అడివి శేష్ ‌లుక్ టెస్ట్ పోస్ట‌ర్‌‌తో పాటు, అమరవీరుల జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ సినిమా తీసే ప్రయాణాన్ని గురించి‌ వెల్లడించిన వీడియోను రిలీజ్ చేసిన‌ విష‌యం తెలిసిందే. మేజర్ టీమ్ ఆగష్టులో కోవిడ్ సమయాల్లో షూటింగ్ తిరిగి ప్రారంభించి అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఇప్పటి వరకు 70% షూట్ పూర్తి చేసింది.
 
తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న‌ ఈ మూవీకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 
మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments