Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#ProudlyIndianతో లావా కొత్త స్పెషల్ ఎడిషన్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

Advertiesment
#ProudlyIndianతో లావా కొత్త స్పెషల్ ఎడిషన్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్
, మంగళవారం, 11 ఆగస్టు 2020 (20:11 IST)
Lava Z61 Pro
కరోనా కారణంగా చైనా మొబైల్స్‌కు మోజు తగ్గడంతో భారత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా కొత్త ఫోన్లకు కొత్త స్పెషల్ ఎడిషన్లను లాంఛ్ చేసింది. లావా జెడ్61 ప్రో, లావా ఏ5, లావా ఏ9 ఫోన్లకు ప్రత్యేకంగా పౌడ్లీఇండియన్ వెర్షన్లు వచ్చాయి. మనదేశ 74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లావా వీటిని లాంచ్ చేసింది. వీటిలో లావా జెడ్61 ప్రో స్మార్ట్ ఫోన్ వెనకాల #ProudlyIndian అనే లోగో ఉండనుంది. 
 
ఇక మిగతా రెండు ఫోన్ల వెనకవైపు భారతదేశ జెండా త్రివర్ణాలు ఉండనున్నాయి. ఇవి త్వరలోనే ఆఫ్ లైన్, ఆన్ లైన్ సేల్‌కు ఇవి రానున్నాయి. లావా జెడ్61 ప్రో, లావా ఏ5, లావా ఏ9 ధర లావా జెడ్61 ప్రో కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. 
 
2 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్‌తో రానున్న ఈ వేరియంట్ ధరను రూ.5,777గా నిర్ణయించారు. షాంపేన్ గోల్డ్ కలర్ వేరియంట్ వెనకవైపు #ProudlyIndianలోగో ఉండనుంది. ఇక లావా ఏ5 ధరను రూ.1,333గానూ, లావా ఏ9 స్మార్ట్ ఫోన్ ధరను రూ.1,574గానూ నిర్ణయించారు. ఈ రెండు ఫోన్లూ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. 
 
లావా జెడ్61 ప్రో స్పెసిఫికేషన్లు ఇందులో 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
దీని యాస్పెక్ట్ రేషియో 18:9గా ఉండనుంది.
3100 ఎంఏహెచ్ బ్యాటరీ
1.6 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్ 
2 జీబీ ర్యామ్, 
16 జీబీ స్టోరేజ్ 
దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. 
బ్లూటూత్ 4.2, వైఫై, జీపీఎస్, యూఎస్ బీ ఓటీజీ, మైక్రో యూఎస్ బీ పోర్టు, ఫేస్ అన్ లాక్ సపోర్ట్
వెనకవైపు 8 మెగా పిక్సెల్, ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరీక్షలు రద్దు చేసి సర్టిఫికేట్లు ఇవ్వడమంటే ఎలా? యూజీసీ