Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఉప్పెన" ఓ క్లాసిక్ మూవీ : హీరో మహేష్ ప్రశంసలు

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (09:47 IST)
మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం "ఉప్పెన". బుచ్చిబాబు సానా టాలీవుడ్‌కు దర్శకుడుగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం. ఈ మూవీ ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
అలాంటివారిలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా కూడా ఉన్నారు. ఈ మూవీ చూసిన తర్వాత ఆయన తన భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. ఈ చిత్రంపై ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'ఉప్పెన' గురించి ఒక్కమాటలో చెప్పాలంటే "క్లాసిక్" అని కొనియాడారు.
 
"బుచ్చిబాబు సానా... మీరు తీసిన చిత్రం అత్యంత అరుదైన.. కలకాలం నిలిచే చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇక 'ఉప్పెన' చిత్రానికి గుండెకాయ అంటే దేవిశ్రీప్రసాద్ అనే చెప్పాలి. ఆల్ టైమ్ గ్రేట్ సంగీతాల్లో ఒకటిగా 'ఉప్పెన' పాటలు, నేపథ్య సంగీతం నిలిచిపోతాయి. డీఎస్పీ... మీరు ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లో ఇదే అత్యుత్తమం. మీరు ఇదే ఒరవడి కొనసాగించాలి" అని ఆకాంక్షించారు.
 
హీరోహీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలను మహేశ్ ఆకాశానికెత్తేశాడు. "ఇద్దరూ కొత్తవాళ్లు అయినా కళ్లు చెదిరేలా నటించారు. మీరిద్దరూ ఇక స్టార్లే!" అని పేర్కొన్నారు. "చివరగా సుకుమార్‌కు, మైత్రీ మూవీ మేకర్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. 'ఉప్పెన' వంటి ప్రాజెక్టుకు మద్దతుగా నిలిచారు. నేను చెప్పినట్టుగా 'ఉప్పెన' సినీ చరిత్రలో కలకాలం నిలిచే చిత్రంగా నిలిచిపోతుంది" అని మహేశ్ బాబు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments