Webdunia - Bharat's app for daily news and videos

Install App

"క్రాక్" విజయంతో రెమ్యునరేషన్ భారీగా పెంచిన రవితేజ!

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (19:59 IST)
మాస్ మహారాజ్ రవితేజ నటించిన చిత్రం 'క్రాక్'. ఈ చిత్రం విజయంతో చాలా రోజుల రవితేజ మళ్లీ ఫాంలోకి వచ్చారు. అలాగే, ఈ యేడాది బ్యాక్ టు బ్యాక్  సినిమాల‌తో అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధమవుతున్నాడు. 
 
'ఖిలాడీ' సినిమా సెట్స్‌పై ఉండ‌గానే త్రినాథ‌రావు న‌క్కిన‌తో క‌లిసి 68వ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశాడు. ఇక ఈ చిత్రానికి ర‌వితేజ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 
 
తాజా టాక్ ప్ర‌కారం ర‌వితేజ ఈ మూవీకి రూ.16 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడ‌ట‌. 'క్రాక్' చిత్రానికి రెమ్యున‌రేష‌న్‌తోపాటు వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌చ్చిన లాభాల్లో షేర్స్ కూడా తీసుకున్నాడు. ఈ దఫా మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ర‌వితేజ డిమాండ్‌కు అనుగుణంగా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు సమ్మతించిందట. 
 
మారుతి-యూవీ క్రియేష‌న్స్ కాంబోలో వ‌స్తున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రానికి మొద‌ట‌ ర‌వితేజ‌ను అనుకోగా.. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌గ్గించుకునేది లేద‌ని ర‌వితేజ చెప్పాడ‌ట‌. దీంతో గోపీచంద్ హీరోగా ఆ ప్రాజెక్టును మారుతి చేస్తున్నాడ‌ని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments