Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబో 2పాయింట్ ఓకు మహేష్ ఫిదా.. చిట్టి కోసం వెయిటింగ్..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (09:08 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న రోబో 2పాయింట్ ఓ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది.


ఈ సినిమాపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. ఈ సినిమా విజువల్స్ , కాన్సెప్ట్ అదిరిపోయాయి. చిట్టి చేసే విధ్వంసాన్ని స్క్రీన్‌ పై చూసేందుకు ఎదురుచూస్తున్నా. శంకర్, రజనీకాంత్ సార్, అక్షయ్ కుమార్, ఏఆర్ రహ్మన్, మీ టీమ్ మొత్తానికీ అభినందనలు అంటూ మహేష్ బాబు వ్యాఖ్యానించారు. 
 
ఇటీవల విడుదలైన '2.0' ట్రైలర్‌ని చూసి ఫిదా అయినట్లు మహేష్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. సినీ అభిమానులు ఈ సినిమా గురించి ఎంగా ఉహించుకున్నారో, అంతకంటే ఎక్కువ విసువల్ ఎఫెక్ట్స్ ట్రైలర్లో కనిపించడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక మహేష్ బాబు ట్వీట్‌ పై అక్షయ్ కుమార్ స్పందించారు. దీన్ని రీట్వీట్ చేసిన అక్షయ్ 'కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. ఈ చిత్రం నెలాఖరులో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
 
కాగా రజనీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 2.0 అఫీషియల్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. 4డీ టెక్నాలజీతో ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. శంకర్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గని విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అబద్ధాలను అందంగా చెప్పడంలో జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: వైఎస్ షర్మిల

యువతిని పొట్టనబెట్టుకున్న పెద్దపులి.. పొలాల్లో పనిచేస్తుండగా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments