Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-11-2018 మంగళవారం దినఫలాలు.. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో...

Advertiesment
06-11-2018 మంగళవారం దినఫలాలు.. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో...
, మంగళవారం, 6 నవంబరు 2018 (08:35 IST)
మేషం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శస్త్రచికిత్స చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. దూరప్రయాణాలు వాయిదాపడుతాయి. 
 
వృషభం: క్రయవిక్రయ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి అనకూలమైన కాలం. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి.
 
మిధునం: చిన్న తరహా పరిశ్రమల్లో వారికి పురోభివృద్ధి కానరాగలదు. ఇతరులకు సలహా ఇవ్వడం మాటపడవలసి వస్తుంది. వాహన యోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. వ్యాపారా లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: కొబ్బరి, పండ్లు, పూల, పానీయ, చిరు వ్యాపారులకు శుభదాయకం. ఉపాధ్యాయులు విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. కొంతమంది మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు ఆత్మనిగ్రహం చాలా అవసరం.
 
సింహం: విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను సమకూర్చుకుంటారు. విద్యార్థులకు మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఇతరులకు పెద్ద మెుత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం.
 
 
కన్య: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి మిశ్రమ ఫలితం. పెద్దల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. భాగస్వామ్యుల మధ్య ఆసక్తి కరమైన విషయాలు చర్చకు రాగలవు. రిప్రజెంటేటివ్‌కు, ఉపాధ్యాయులకు సదవకాశాలు లభించగలవు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి.
 
తుల: ఆస్థి విషయంలో సోదరుల నుండి ప్రతికూలతలెదుర్కోవలసి వస్తుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు వింటారు. పెద్దల సహకారంల లోపిస్తుంది. మీ పట్టుదల వలన శ్రమాధిక్యత, ధననష్టం ఎదుర్కుంటారు. స్త్రీలకు దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది.
 
వృశ్చికం: నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాసం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. క్రీడా, కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరగగలదు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు: రియల్ ఎస్టేట్ రంగాల్లో వారు మాటపడక తప్పదు. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడుతాయి. సినిమా, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల కలయిక వలన మీ సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి.
 
మకరం: వ్యాపార లావాదేవీల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు తప్పవు. శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే గానీ పనులు పూర్తికావు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా తొందరపాటుతనంతో జార విడుచుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి.
 
కుంభం: ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. ఇతరులను సాయం చేసి ఆదుకోవాలనే తలంపుతో చిక్కులు కొనితెచ్చుకునే ప్రమాదం ఉంది. హామీలు, మధ్యవర్తిత్వాల వలన ఇబ్బందులెదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం లభిస్తుంది.
 
మీనం: రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. వస్త్ర, బంగారం, పచారీ, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. రుణయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు అధికం. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరకచతుర్దశినాడు.. ఏ దిశలో దీపం వెలిగించాలి?