Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-11-2018 గురువారం దినఫలాలు - ఆర్థిక సంతృప్తి...

Advertiesment
01-11-2018 గురువారం దినఫలాలు - ఆర్థిక సంతృప్తి...
, గురువారం, 1 నవంబరు 2018 (09:06 IST)
మేషం: శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. స్వయం కృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. మెుండి బాకీలు సైతం వసూలుకాగలవు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. పాత రుణాలు తీరుస్తారు. 
 
వృషభం: మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి అమ్మకం వాయిదా పడడం మంచిది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు. 
 
మిధునం: రచయితలు, పత్రిగా, ప్రైవేటు సంస్థల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. విద్యార్థుల విలువైన వస్తువులు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. 
 
కర్కాటకం: మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ప్రయాసలెదుర్కుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించుకోవలసి వస్తుంది. తోటివారి ఉన్నతస్థాయిలో పోల్చుకోవడం క్షేమంకాదు. క్యాటరిగ్ పనివారలకు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.  
 
సింహం: ఉద్యోగస్తులు తమ తొందరపాటుతనానికి చింతించవలసి ఉంటుంది. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. అయిన వారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు. ఈ రోజు పనులు రేపటికి వాయిదా వేయకండి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
కన్య: ఆర్థిక లావాదేవీలు, నూతన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వలన ఆటుపోట్లు తప్పవు. ఆత్మీయుల కలయిక వలన మానసికంగా కుదుటపడుతారు. స్త్రీలకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. 
 
తుల: దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులలో ఆందోళన తొలగిపోయి నిశ్చింత చోటుచేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఖర్చులు నియంత్రించడంలో విఫలమవుతారు. తలపెట్టిన పనిలో ఆటంకాలు ఎదురైనా ధైర్యం, పట్టుదలతో శ్రమించి విజయం పొందుతారు.   
 
వృశ్చికం: మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తుల వారికి మిశ్రమ ఫలితం. ఆర్థిక సంతృప్తి అంతంత మాత్రంగానే ఉంటుంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ముఖ్యమైన పనులు ఆశించిన రీతిలో పూర్తిచేస్తారు.    
 
ధనస్సు: కాంట్రాక్టర్లు నూతన టెండర్లు అతి కష్టం మీద చేజిక్కించుకుంటారు. నిరుద్యోగులకు స్థిరమైన అవకాశాలు లభిస్తాయి. మార్కెట్, ప్రింటింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. తరచు శుభ, దైవ కార్యాలు, సభలు, సమావేశాలలో పాల్గొనడం వలన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుతాయి.   
 
మకరం: చేతి వృత్తి వ్యాపారులకు కలిసివస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసివచ్చే కాలం. సన్నిహితులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  
 
కుంభం: ఒక విషయంలో మీ మిత్రుల తీరు మీకెంతో నిరుత్సాహపరుస్తుంది. ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి సాధించడంతో పాటు మరికొంత ఉపాధి కల్పిస్తారు. బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. క్యాటరింగ్ పనివారలకు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. చిన్నారులతో బంధం ఏర్పడుతుంది.  
 
మీనం: చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు తమ ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థుల లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు, పనివారలకు ఆశాజనకరం. సన్నిహితులు ఒక వ్యవహారంలో మిమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.     

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకే ఆ ఎనిమిదవ అవతారం