Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-10-2018 సోమవారం దినఫలాలు... గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా

Advertiesment
29-10-2018 సోమవారం దినఫలాలు... గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా
, సోమవారం, 29 అక్టోబరు 2018 (09:02 IST)
మేషం: ఉద్యోగస్తుల సమర్థత, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల మధ్య అవగాహనలోపం వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలకు పనివారు రాక పనిభారం అధికమవుతుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. 
 
వృషభం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సోదరీసోదరులు, బంధువుల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత బలపడుతాయి. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. రవాణా రంగాలలో వారు చికాకులు ఎదుర్కుంటారు.  
 
మిధునం: ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవాడానికి యత్నించండి. వాతావరణఁలోని మార్పు మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది.  
 
కర్కాటకం: చేపట్టిన వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు తాత్కలిక అవకాశాలు లభిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. పెద్దల మాటను శిరసా వహిస్తారు. ఎప్పటి నుండో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు.   
 
సింహం: గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం కలదు. వృత్తి, వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించడం మంచిది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కన్య: దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. పాత బిల్లులు చెల్లిస్తారు. రాజకీయనాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. విదేశాలు వెళ్ళడానిటి చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు బంధువుల కోసం షాపింగ్ చేస్తారేు. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.  
 
తుల: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థుల మెుండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. పండ్లు, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలం.   
 
వృశ్చికం: కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లు చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు షాపింగ్‌ల్లో నాణ్యతను గమనించాలి. బ్యాంకు పనులు వాయిదా పడుతాయి. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.    
 
ధనస్సు: ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. ఉద్యోగస్తులు అధికారులకు మరింత చేరువవుతారు. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం.   
 
మకరం: బాకీలు, ఇంటి అద్దెల వసూళ్లలో సౌమ్యంగా మెలగాలి. బ్యాంకులు, ఏ.టి.ఎం.ల నుండి ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రింటింగ్ రంగాల వారు పురోభివృద్ధి పొందుతారు. మీ అవసరాలకు కావలసిన ధనం కోసం ఇబ్బందులెదుర్కుంటారు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు.  
 
కుంభం: వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, హాడావుడి ఎదుర్కుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాభివృద్ధికి షాపుల అలకంరణ కొత్త పథకాలు రూపొందిస్తారు.  
 
మీనం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఎంతో కొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశ నెరవేరదు. ఏ యత్నం కలిసిరాస నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.     

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-10-2018 - ఆదివారం దినఫలాలు - గౌరవ మర్యాదలకు భంగం...