Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-11-2018 శుక్రవారం రాశిఫలితాలు... స్త్రీలు తెలివి తేటలతో

Advertiesment
Daily Horoscope
, శుక్రవారం, 2 నవంబరు 2018 (09:00 IST)
మేషం: గణిత, సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ వృత్తుల్లో వారికి కలిసి వచ్చే కాలం. విద్యార్థులు స్వయంకృషితో బాగా రాణిస్తారు. దంపతుల మధ్య కలహాలు ప్రశాంతత లోపం వంటి చికాకులు ఎదురవుతాయి. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు, ఆరోగ్యంలో మెళకువ అవసరం. కొన్ని సమస్యల నుండి తేలికగా బయటపడుతాయి.  
 
వృషభం: వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. తీర్ధయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 
 
మిధునం: ఊహించని వ్యక్తుల నుండి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. దైవ దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన పరిచయాలు మీ ఉన్నతికి, పురోభివృద్ధికి తోడ్పడతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. మీ యత్నాలకు సన్నిహితుల సహకారం అన్నివిధాలా అందుతుంది.  
 
కర్కాటకం: స్త్రీలు తెలివి తేటలతో వ్యవహరించడం వలన కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఇంక్రిమెంట్లు, అడ్వాన్సులు లభిస్తాయి. గృహంలో పనులు వాయిదా పడుతాయి. ప్రేమికుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజార్చుకుంటారు.  
 
సింహం: బ్యాంకు పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. శ్రమాధిక్యతో పనులు పూర్తిచేస్తారు. జీవితం ఆనందంగా గడిచిపోతున్నప్పటికీ మీ లక్ష్యం మిమ్మల్ని ఓ కొత్త మార్గం పైవు నడిపిస్తుంది. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు సంభవం. ఆకస్మిక ప్రయాణాలు చికాకులను కలిగిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.  
 
కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. ఏదైనా చేయ్యాలని నిర్ణయించుకుంటే దానికి తగిన ధనం లేదని చింతిస్తూ కూర్చోవద్దు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. మేథస్సు వృద్ధి చెంది, ఉన్నతంగా ఎదుగుతారు.  
 
తుల: సన్నిహితుల సహాయంతో పనులు చక్కదిద్దితారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూనె, కంది, మిర్చి, స్టాకిస్టులకు లాభదాయకం. ముఖ్యుల రాకపోకలు పెరుగుతాయి. ప్రభుత్వోద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. చేతివృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది.  
 
వృశ్చికం: ఆర్థికస్థితిలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందులు ఎదుర్కుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉగ్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు, బహుమతులు వస్తాయి. కొన్ని వ్యవహారాల్లో జరిగిన కాలయాపన వలన ఒకింత ఒడిదుడుకులు తప్పవు.   
 
ధనస్సు: శ్రమాధిక్యంతో పనులు పూర్తిచేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. రాజకీయ, కళా రంగాలవారికి విదేశీ పర్యటనలు సంభవం. జీవితం ఆనందంగా గడిచి పోతున్నప్పటికీ మీ లక్ష్యం మిమ్మల్ని ఓ కొత్త మార్గం వైపు నడిపిస్తుంది. ప్రయాణాలు చికాకులు కలిగిస్తాయి. బ్యాంకు పనులు నెమ్మదిగా సాగుతాయి.  
 
మకరం: స్త్రీలు శుభకార్యాల్లో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పురోభివృద్ధి. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు, పరిశ్రమలకు అవసరమైన లైసెన్సులు అనుకూలిస్తాయి. ఖర్చులు రాబడికి మించడంతో చేబదుళ్ళు స్వీకరిస్తారు. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.  
 
కుంభం: దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. సన్నిహితుల మధ్య దాపరికాలు సరికాదని గ్రహించాలి. నూతన అగ్రిమెంట్లు వాయిదా పడడం మంచిది. దైవదీక్షా కార్యక్రమంలో పాల్గొంటారు.  
 
మీనం: అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. చిరకాలవు స్వప్నాలు నిజమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు లభిస్తాయి.     

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''శ్రీరామజయరామ జయజయరామ'' అని పలికితే..?