05-11-2018 సోమవారం దినఫలాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమంచినా..

సోమవారం, 5 నవంబరు 2018 (08:57 IST)
మేషం: స్త్రీలకు బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రభుత్వ సంస్థలలో పనులు మందకొడిగా సాగుతాయి. రాబోయే సమస్యలను తేలికగా గ్రహించడం వలన రాజకీయాల్లో వారు కుదుటపడుతారు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయవద్దు.
 
వృషభం: రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. ఆకస్మిక ఖర్చులు ఎదురు కావడంతో చేబదుళ్ళు, రుణయత్నాలు చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. మీ సోదడి మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.  
 
మిధునం: ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. విద్యార్థినుల మెుండితనం అనార్థాలకు దారితీస్తుంది. స్త్రీలు టి.వి కార్యక్రమాలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.  
 
కర్కాటకం: అనుభవం లేని విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళకువ వహించండి. ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది.  
 
సింహం: ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. హామీలు, మధ్యవర్తిత్వాల వలన ఇబ్బందులెదుర్కుంటారు. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకోవచ్చు. ఓర్పు, పట్టుదలతో శ్రమంచినా గాని అనుకున్న పనులు పూర్తికావు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త అవసరం. 
 
కన్య: పొగాకు, ప్రత్తి రంగాలలో వారికి కలిసి వచ్చేకాలం. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల ఏకాగ్రత అవసరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో అధికారులతో మాటపడతారు.  
 
తుల: శత్రువులు మిత్రులుగా మారి మీకు సహాయాన్ని అందిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. విదేశీ వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం కోసం ధనం బాగుగా వ్యయం చేస్తారు. ఆత్మీయులు, బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి.  
 
వృశ్చికం: కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. నిరుద్యోగులకు రాత, మౌఖి, పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. రుణ బాధలు తొలగిపోతాయి.  
 
ధనస్సు: రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో చికాకులు తప్పవు. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్రప్రభాలం చూపుతుంది. స్త్రీలు ఉపవాశాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్పం అస్వస్థతకు గురవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మకరం: శ్రీవారు, శ్రీమతి ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ఆహార, వ్యవహారాలు, ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత చాలా అవసరం. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం.  
 
కుంభం: రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీ అతిధి మర్యాదలు ఎదుటివారిని సంతృప్తిపరుస్తాయి. విద్యార్థుల మెుండివైఖరి ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది. మీ గౌరవ ప్రతిష్టకు భంగం కలుగకుండా వ్యవహరించడం వలన అపార్థాలకు ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు.  
 
మీనం: స్త్రీలతో అతిగా సంభాషించడం వలన అపార్థాలకు గురికావలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. పాత బాకీలు వసూలు కాగలవు. సోదరీసోదరుల మధ్య ఏకీభావం కుదరదు. ఖర్చులు, చెల్లింపుల విషయంలో ఏకాగ్రత వహించండి.  

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 04-11-2018 ఆదివారం దినఫలాలు - స్త్రీలు పనిలో ఒత్తిడి, చికాకులను...