Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-11-2018 ఆదివారం దినఫలాలు - స్త్రీలు పనిలో ఒత్తిడి, చికాకులను...

Advertiesment
04-11-2018 ఆదివారం దినఫలాలు - స్త్రీలు పనిలో ఒత్తిడి, చికాకులను...
, ఆదివారం, 4 నవంబరు 2018 (09:51 IST)
మేషం: కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. క్రయవిక్రయాలు సంతృప్తినిస్తాయి. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యాలు మనస్తాపం కలిగిస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. కళ, క్రీడాకారులకు సదవకాశాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. 
 
వృషభం: కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు లాభదాయకం. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో పునరాలోచన చాలా అవసరం. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానరాగలదు.  
 
మిధునం: స్త్రీలు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీ మాటకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్య విషయంలో సంతృప్తికానరాదు. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. గృహంలో మార్పులు చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. 
 
కర్కాటకం: ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మిత్రులతో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు. సోదరీసోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు. స్థిర, చరాస్తు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. ఖర్చులు పెరగటంతో రుణాలుస చేబదుళ్ళు తప్పవు.  
 
సింహం: భాగస్వామిక వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన స్పురిస్తుంది. కుటుంబీకుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. కలప, ఐరన్, ఇటుక, సిమెంట్ వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. స్త్రీలు అనవసరపు విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. 
 
కన్య: మీ శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్య నుండి బయటపడుతారు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడుతాయి. వృత్తి పనుల కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు. సహోద్యోగులు, సన్నిహితులతో సమావేశం నిరాజనకంగా ముగుస్తుంది.   
 
తుల: స్త్రీలు తొందరపడి సంభాషించడం వలన మాటపడక తప్పదు. మీ నూతన ఆలోచనలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఆశించిన ప్రమోషన్లు, బదిలీలు అనుకూలించడానికి మరి కొంతకాలం పడుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం: లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుకుంటారు. మందులు, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదాపడుతాయి. ఒక శుభకార్యం నిశ్చయం కావడంతో గృహంలో సందడి నెలకొంటుంది.  
 
ధనస్సు: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు, నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఒత్తిడి, ఆటంకాలు ఎదురవుతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు అనుకూలం.   
 
మకరం: ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. క్రీడా, కళా, సాంస్కృతిక రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. షేర్ల కొనుగోలులో పునరాలోచన అవసరం. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. క్యాటరింగ్ రంగాల్లో పనివారాలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యుల కలయిక అనకూలిస్తుంది. ఒక స్థాయి వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది.  
 
కుంభం: వస్త్ర రంగాలలో వారికి అనుకూలత. స్త్రీలు ఆర్థిక విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. చేతివృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఆకస్మికంగా పొట్ట, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.  
 
మీనం: బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికం కావడం వలన ఆందోళన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మీరు చేయని కొన్ని పనులకు మీపై నిందలు మోపే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు.    

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-11-2018 నుంచి 10-11-2018 వరకూ మీ వార రాశి ఫలితాలు (video)