04-11-2018 నుంచి 10-11-2018 వరకూ మీ వార రాశి ఫలితాలు (video)

శనివారం, 3 నవంబరు 2018 (19:16 IST)
కర్కాటకంలో రాహువు, తులలో రవి, వక్రి శుక్రుడు, వృశ్చికంలో గురువు, బుధులు, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులు. కన్య, తుల, వృశ్చిక, ధనస్సులో చంద్రుడు. 6వ తేదీన కుజుడు కుంభ ప్రవేశం. 6న నరక చతుర్థశి, 7వ తేదీన దీపావళి, కేదార గౌరీ వ్రతం. 8న ఆకాశదీపం. 9వ తేదీన భగినీ హస్త భోజనం. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. అనవసర జోక్యం తగదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆది, గురు వారాల్లో సంతానం దూకుడును అదుపు చేయండి. సన్నిహితులను వేడుకలకు ఆహ్వానిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ప్రకటనలు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. దైవదీక్షలు స్వీకరిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త.  
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. పొదుపు మూలక ధనం ముందుగానే గ్రహిస్తారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. కొంతమంది వ్యాఖ్యాలు ఆలోచింపచేస్తాయి. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. మంగళ, శని వారాల్లో ముఖ్యులు ఇంటర్వ్యూ అనుకూలించదు. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. గృహమార్పు, యత్నం కలిసివస్తుంది. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.    
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మెుండి బాకీలు వసూలు కాగలవు. ఖర్చులు సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు సకాలంలో పూర్తికాగలవు. గురు, శుక్ర వారాల్లో నోటిసులు అందుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వేడులకలను ఘనంగా చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు, దైవదీక్షలు స్వీకరిస్తారు. ఆత్మీయుల క్షేమం సంతృప్తినిస్తుంది. ప్రయాణంలో చికాకులు తప్పవు.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ధనమూలక సమస్యలెదుర్కుంటారు. రుణదాతల ఒత్తిడి అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. పనులు ముందుకు సాగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. శనివారం నాడు పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు.     
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. వివాహయత్నం ఫలిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఆదాయాభివృద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ధనలాభం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 3 పాదాలు
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి. వాహనయోగం ఉన్నాయి. ఆభరణాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకల్లో పాల్గొంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం ఇతరులకివ్వడం శ్రేయస్కరం కాదు. ప్రయాణం కలిసివస్తుంది.  
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. దైవకార్యంలో పాల్గొంటారు. గృహమార్పు ఆశించిన ఫలితం ఇస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆది, సోమ వారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి వస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. సోదరుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. మంగళ, బుధ వారాల్లో ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. సంప్రదింపులకు అనుకూల్ం. స్థిమితంగా ఆలోచించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు సామాన్యంగా తాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. అవివాహితులకు మనస్థిమితం ఉండదు. వ్యవహారాల్లో ప్రతికూలతలు చికాకులు అధికం. గురు, శుక్ర వారాల్లో ఓర్పుతో మెలగాలి. అనవసర జోక్యం తగదు. మీ అభిప్రాయాకు ఏమంత స్పందన ఉండదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో చికాకులు తప్పవు.   
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాగ్ధాటితో రాణిస్తారు. పరిచయాలు బలపడుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆర్థికంగా పురోగమిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. అనేక పనులతో సతమతమవుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. శనివారం నాడు నగదు. పత్రాలు జాగ్రత్త. కాంట్రాక్టులు, ఏజెన్సీలు చేజిక్కించుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఊహించని సంఘటనలెదురయ్యే సూచనలున్నాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వివాదాలు కొలిక్కి వస్తాయి.  
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. ఆది, సోమ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఒత్తిడి తగ్గి కుదుటపడుతారు. వ్యవహారానుకూలత ఉంది. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. పొదుపు పథకాలు లభిస్తాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. దైవదీక్షలు స్వీకరిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. మంగళ, బుధ వారాల్లో ధైర్యంగా అడుగువేయండి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. కొత్త వ్యాపాకాలు సృష్టించుకుంటారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పెదవి పై భాగంలో పుట్టుమచ్చ ఉంటే.. వారు..?