పెదవి పై భాగంలో పుట్టుమచ్చ ఉంటే.. వారు..?

శనివారం, 3 నవంబరు 2018 (17:50 IST)
సాధారణంగా పుట్టుమచ్చలు అందరికి ఉంటాయి. మరి ఆ పుట్టుమచ్చులు పెదాలపై ఉంటే ఏంటి ఫలితం.. పై పెదవియందు పుట్టమచ్చ ఉంటే జీవితమంతా సంతోషంగా ఉంటారని అర్థం. అంతేకాకుండా శుభకార్యాలలో మీరే పెద్దలుగా ఉండి అన్నీ కార్యక్రమాలు జరుపుతారని పండితులు చెప్తున్నారు.
 
దాంతోపాటు భోగభాగ్యాలు, సిరిసంపదలు కూడా చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా రాజకీయాల్లో పాల్గొంటారు. అలానే పై పెదవి లోపలి భాగంలో పుట్టుమచ్చ ఉంటే మంత్ర శాస్త్రాల యందు ఆసక్తి గలవారై ఉంటారు. 
 
అలానే కింది పెదవి పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే.. వారు ధనవంతులవుతారని పురాణాలలో చెప్పబడింది. అలానే మీరు అధిక భోజన ప్రియులై ఉంటారు. చివరగా.. పెదవి కింద లోపలి భాగంలో పుట్టుమచ్చ ఉంటే.. వారు కఠినంగా మాట్లాడేవారులా ఉంటారు. దుష్టులతో సహవాసాలు చేస్తారు. మద్యపానం సేవించే వారౌతారు. దాంతో పాటు దేవుళ్లను నిందించేవారుగా ఉంటారు. బంధుమిత్రులకు దూరంగా ఉంటారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం దీపావళి నాడు ఆ నూనెతో తలస్నానం చేస్తే..?