2.0 కోసం శంక‌ర్ అన్నిసార్లు క‌థ మార్చాడా..? ఆయన అతిజాగ్రత్త ఏం చేస్తుందో?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (20:00 IST)
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్టర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన సెన్సేష‌న‌ల్ మూవీ 2.0. భార‌త‌దేశంలో అత్యంత భారీ బ‌డ్జెట్ 600 కోట్ల‌తో రూపొందిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేసారు. హాలీవుడ్ మూవీని చూసిన ఫీల్ క‌లిగిస్తోన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమా నాలుగు సంవ‌త్స‌రాల పాటు సెట్స్ పైన ఉంది. అయినా... ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. చాలా రీషూట్లు చేసాడు శంక‌ర్. బ‌డ్జెట్ 600 కోట్లు అవ్వ‌డానికి ఇదే ప్ర‌ధాన కార‌ణం. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ క‌థ‌ని శంక‌ర్ మూడుసార్లు మార్చాడ‌ట. దీంతో రీషూట్ల మీద రీషూట్లు చేసుకుంటూ వెళ్లాల్సి వ‌చ్చింది. రెహ‌మాన్ కూడా ఈ సినిమా కోసం మూడుసార్లు రీ-రికార్డింగ్ కూడా మార్చాల్సివ‌చ్చింది. అంటే.. ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిన త‌ర్వాత కొత్త సీన్ రాసార‌న్న‌మాట‌. నాలుగేళ్లుగా క‌థ‌లో మార్పులు చేస్తూనే ఉన్నార‌న్న‌మాట‌. శంక‌ర్ గ‌త చిత్రం ఐ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో 2.0 సినిమాపై మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. మ‌రి.. ఈ అతి జాగ్ర‌త్త ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

గ్రీన్‌ఫీల్డ్ అమరావతి.. రైతు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం.. మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments