Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24 కిస్సెస్.. 23న రిలీజ్..?

24 కిస్సెస్.. 23న రిలీజ్..?
, సోమవారం, 5 నవంబరు 2018 (13:21 IST)
24 కిస్సెస్ చిత్రం నవంబర్ 23న విడుదల కానుంది. ఆదిత్ అరుణ్, హెబ్బాపటేల్ నటిస్తున్న 24 కిస్సెస్ సినిమాను దర్శకుడు అయోధ్య కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


బోల్డ్ కంటెంట్‌కు తోడు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు అయోధ్యకుమార్. సిల్లీమాంక్స్ ఎంటర్ టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా 24 కిస్సెస్ సినిమాను నిర్మిస్తున్నారు.
 
అలాగే ఈ సినిమాకు హెబ్బా, ఆదిత్ మధ్య కెమిస్ట్రీ హైలైట్ కానుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకలను ఈ చిత్రం కచ్చితంగా అలరిస్తుందని దర్శక నిర్మాతలు చెప్తున్నారు.

ఈ సినిమాలో రావు రమేష్, నరేష్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే... జోయ్ బరువా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఫిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సాటి మనిషిని బానిసలాగా చూడాలంటే నీ గుండెలదరాలి' : భైరవగీత ట్రైలర్