వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పిస్తున్న తాజా చిత్రం భైరవగీత. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ఆలోచనను ఆలోచించిన మనిషిని చంపలేకపోతే ఏం చెయ్యాలా? ఆ ఆలోచన ఎవరి గురించో వారిని చంపేస్తే సరిపోద్ది అయ్యా.. అనే డైలాగ్ సినిమా ఎలా ఉండనుందో తెలుపుతుంది.
తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు వర్మ దర్శకత్వం వహించకపోయినా.. సిద్ధార్థ్‌కు అన్నివిధాలా సహకరించినట్లు ఈ ట్రైలర్ చూస్తే ఇట్టే తెలిసిపోతోంది. గతంలో ఓ ట్రైలర్ విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచిన యూనిట్, తాజాగా మరో ట్రైలర్ విడుదల చేసి మరింత ఆసక్తి కనబరచేలా చేశారు.
ఈ చిత్రాన్ని యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ ప్రేమ కథ చిత్రంలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. 'మనుషులను బానిసలుగా చూసే ప్రతి ఒక్కరి గుండెల్లో దింపే కత్తే దీనికి సమాధానం' అంటూ ఫ్యాక్షన్ పెద్దలపై తిరుగుబాటును కూడా ఈ ట్రైలర్లో చూపించారు.
'సాటి మనుషులను బానిసలుగా చూడాలంటే నీ గుండెలు అదరాలి' అంటూ ముగించి సినిమాలపై అంచనాలు పెంచారు. ఈ సినిమా ఈ నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.