నా కెరీర్ కోసం తాంత్రిక పూజ చేయించాను: పాయల్ రోహిత్గి

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (14:15 IST)
Payal Rohatgi
బాలీవుడ్‌లో వివాదాస్పద నటి కంగనా రనౌత్ నిర్వహిస్తున్న లాక్ ఉప్ షో మాంచి రేటింగ్‌లో దూసుకెళ్తోంది. ఈ షోలో కొనసాగాలంటే.. ఇంకా ఎలిమినేట్ కాకుండా వుండాలంటే పార్టిసిపెంట్లు తమ జీవితంలో జరిగిన సీక్రెట్లను బయటపెట్టాలి. అలా తాజాగా పాయల్ రోహత్గి తన జీవితంలో జరిగిన ఇంట్రస్టింగ్ విషయాలను బయటపెట్టింది. లాక్ ఉప్ తాజా ఎపిసోడ్ లో, పాయల్ రోహత్గి ఆటలో ఉండటానికి, ఎలిమినేషన్ నుండి తనను తాను రక్షించుకోవడానికి తన లైఫ్ సీక్రెట్‍లలో ఒకదాన్ని వెల్లడించింది. తన కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు తాను వశికరన్ (తాంత్రిక పూజ) చేశానని నటి తెలిపింది.
 
"నేను 15సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నాను. కెరీర్ పరంగా వృద్ధి కోసం తాంత్రిక పూజ చేశాను" అని పాయల్ ఒప్పుకుంది. ఢిల్లీ పూజారి సాయంతో ఈ పూజ జరిగింది. కానీ అందులో ఏదీ తనకు ఒరిగిందేమీ లేదు. తన కెరీర్‌ను కాపాడుకోవడానికి తాను తాంత్రిక పూజ చేశాను కానీ అది తనకు సాయపడలేదని పాయల్ వెల్లడించింది. 
 
 విషయం ఎక్కడా చెప్పలేదని.. అమ్మకు చెప్తే ఎగతాళి చేస్తుందని దాచేశానని చెప్పింది. దీన్ని విన్న హోస్ట్ కంగనా రనౌత్ జోకులు వేస్తూ నవ్వేసింది. పాయల్‌ను ఉద్దేశించి... "పాయల్ మీరు చాలా అందంగా వుంటారు. అలాగే ప్రతిభావంతులు అని నేను అనుకుంటున్నాను, మీకు తాంత్రిక అవసరం లేదు." అని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments