Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎందుకు పాటలో వర్మ టార్గెట్ చేశారా? లక్ష్మీపార్వతి ఏమంటున్నారు?

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (12:50 IST)
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ఎందుకు అనే పాటను 'వర్మ' తాజాగా రిలీజ్ చేశారు. 
 
గతంలో వెన్నుపోటు పాటను విడుదల చేసిన వర్మ.. మంగళవారం సాయంత్రం ఎందుకు? అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటపై అన్నివర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ పాటపై లక్ష్మీపార్వతి స్పందించారు. 
 
వర్మ తాజాగా విడుదల చేసిన ఎందుకు పాట తనకు చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఈ పాటలో దర్శకుడు తనను విమర్శించినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే పాట చివరిలో మాత్రం ఇవన్నీ ప్రశ్నలేనని వర్మ చెప్పారన్నారు. తెలుగుదేశం నేతలు అప్పట్లో తన కులం తనది కాదనీ, తన ఊరు నిజంగా తన సొంతూరు కాదని తప్పుడు ప్రచారం చేశారని లక్ష్మీపార్వతి విమర్శించారు.
 
తాను ఎన్టీఆర్ భార్యను కాదనీ, అసలు ఆయన తనను పెళ్లే చేసుకోలేదని 20 ఏళ్లుగా దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. బయోపిక్ అంటే సుఖంగా ఉండటమే కాదనీ, ఆయన పడిన కష్టాలు, బాధలను చూపించాలని స్పష్టంచేశారు. సినిమాల్లోకి రాకముందు సైతం ఎన్టీఆర్ కష్టాలు పడ్డారని వ్యాఖ్యానించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments