వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా ''లక్ష్మీస్ ఎన్టీఆర్''. ఈ సినిమాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులోని వెన్నుపోటు పాటపై తెలుగుదేశం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. అయినా వారికి వర్మ కౌంటరిచ్చారు. తాజాగా ఈ సినిమాపై సినీ నటుడు శివాజీ హాట్ కామెంట్స్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీపార్వతి చీకటి రోజుల్లో ఎన్టీఆర్ జీవితంపై తీస్తున్న సినిమాగా భావిస్తున్నానన్నారు.
ఈ సినిమాలో వర్మ వైశ్రాయ్ హోటల్ ఉదంతం కూడా ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్‌కి తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పిన శివాజీ.. అప్పుడు ఎన్టీఆర్‌పై చెప్పులు వేసింది లక్ష్మీపార్వతి మనుషులేనని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వైశ్రాయ్ ఎపిసోడ్‌కు కొత్త కోణం ఇచ్చిన శివాజీ... అది వెన్నుపోటు కాదని, వెన్నుదన్ను అన్నారు.
చంద్రబాబు ఆరోజు అలా చేయకపోతే టీడీపీనే కాదు.. బీజేపీ కూడా ఉండేది కాదని చెప్పుకొచ్చారు. సుగ్రీవుడి కోసం రాముడు ఏం చేశాడో.. టీడీపీ కోసం, ఏపీ కోసం చంద్రబాబు కూడా అదే చేశారని అన్నారు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని చెబుతూనే.. బాబును సమర్థించారు. వెన్నుపోటు, వెన్నుదన్నుకు తేడా తెలియని వర్మ ఎలాంటి సినిమా తీస్తాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని శివాజీ చెప్పారు.