Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోరారా అమ్మా అని పిలిచేవాడు.. లక్ష్మీపార్వతి : ప్లీజ్ ప్రసారం చేయొద్దు.. మంచు మనోజ్

సినీ హీరో, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ అకాల మరణంపై స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. హరికృష్ణ మరణ వార్తను విని తట్టుకోలేక పోతున్నానని అన్నారు. తనను నోరారా అమ్మా అని పిల

Advertiesment
Lakshmi Parvathi
, బుధవారం, 29 ఆగస్టు 2018 (12:52 IST)
సినీ హీరో, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ అకాల మరణంపై స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. హరికృష్ణ మరణ వార్తను విని తట్టుకోలేక పోతున్నానని అన్నారు. తనను నోరారా అమ్మా అని పిలిచేవాడని గుర్తు చేశారు. ఎన్టీఆ‌ర్‌తో పెళ్లి విషయంలో తనతో తొలుత విభేదించినప్పటికీ, ఆ తర్వాత చాలా బాగా కలసిపోయాడని తెలిపారు.
 
దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని సంతకాల సేకరణ చేపట్టినప్పుడు, సంతకాల సేకరణ కోసం హరికృష్ణని కలిశానని... సంతకం చేశాడని తెలిపారు. హరికి డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టమని, డ్రైవింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉందని, కానీ మృత్యువు ఎలా వెంటాడిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండాల్సిందని అన్నారు.
 
అలాగే, సినీ హీరో మంచు మనోజ్ కూడా మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. మీడియా పదేపదే ప్రమాద ఘటన దృశ్యాలను చూపడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోలతో నందమూరి కుటుంబాన్ని మరింత క్షోభకు గురిచేయవద్దని ప్రాధేయపడ్డాడు. ఈ మేరకు మనోజ్ ఈ రోజు ఓ ట్వీట్ చేశాడు.
 
ప్రమాద ఘటన వీడియోను మీడియాలో చూసిన అభిమానులు, కుటుంబ సభ్యులు మరింత కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలనీ.. తన విజ్ఞప్తిని మీడియా మన్నిస్తుందని ఆశిస్తున్నట్లు మనోజ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా సీతయ్య ఇకలేరు : హరికృష్ణ మృతిపై వైవీఎస్ చౌదరి