Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ముందున్న కాళ్లు అతనివే.. వినయంతో మనసు దోచేశాడు

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (12:12 IST)
కోలీవుడ్ టాప్ హీరోలలో విజయ్ ఒకరు. ఈయనకు హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉండటంతో పాటుగా అభిమానులు ముద్దుగా ఇళయ దళపతిగా పిలుచుకుంటూ ఉంటారు. సినిమాలలోనే కాదు ఆయనకు బయట కూడా చాలా మంచి పేరుంది. సింప్లిసిటీకి పెద్దపీట వేసే విజయ్ ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికలలో సామాన్య పౌరుడిలా క్యూలో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 
అతని ప్రవర్తనపై అన్నిచోట్లా ప్రశంసలు దక్కాయి. అయితే ఇటీవల ఓ చాట్ షోకి హాజరైన బాలీవుడ్‌ కథానాయిక కత్రినా కైఫ్‌ కూడా విజయ్ ప్రవర్తనకు ముగ్ధురాలైనట్లు తెలిపారు. కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించారు. ఆ సమయంలో విజయ్ అందరి పట్ల చూపిన గౌరవం చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. 
 
'ఊటీలో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు, మేమంతా ఫ్లోర్‌పై కూర్చుని ఉన్నాము. బాగా చలిగా ఉండగా, నేను ఫోన్‌ చూసుకుంటూ కూర్చున్నాను. అప్పుడు నా ముందు రెండు కాళ్లు కనిపించాయి. ఎవరో నిల్చుని ఉన్నారులే అనుకుని.. తలెత్తి చూడకుండా మళ్లీ ఫోన్‌లో మునిగిపోయాను. కాసేపటి తర్వాత ఆ కాళ్లు ఇంకా నా ముందే ఉండటంతో.. ఎవరా అని చూశాను. అప్పుడనుకున్నా.. ఈ వ్యక్తితో కలిసి ప్రకటనలో నటించా కదా, ఆయనే సౌత్‌ సూపర్‌స్టార్‌, విజయ్‌. నేను ఫోన్‌‌లో బిజీగా ఉండటం చూసి నన్ను డిస్టర్బ్‌ చేయకూడదని అలా నిల్చుండిపోయారు విజయ్. బై అనే చిన్నమాట చెప్పడానికొచ్చి, అంతసేపు వినయంగా నా కోసం ఎదురుచూడటం ఆశ్చర్యంగా అనిపించింది' అని కత్రినా పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరిదితో అక్రమ సంబంధం.. నిద్ర మాత్రలతో భర్త చనిపోలేదని కరెంట్ షాకిచ్చి చంపేసిన భార్య

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments