Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ స్టార్‌పై కన్నేసిన హాలీవుడ్... లంచ్‌కు ఆహ్వానం

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (11:56 IST)
గత కొంతకాలంగా ఇండియన్ సినిమాలో దక్షిణాది సినిమాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునే పరిస్థితిలో ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లుగా తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన 'బాహుబలి', '2.O' వంటి సినిమాలకు అంతర్జాతీయంగా మంచి క్రేజ్ దక్కింది. 
 
ఇటీవల 'అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌' డైరెక్టర్‌ జో రుసో కూడా సౌతిండియన్ సినిమా గురించి మాట్లాడారు. 'అవెంజర్స్‌: ది ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్' సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్‌ తీసిన 'రోబో' సినిమా స్ఫూర్తి అని పేర్కొన్నారు. తాజా ప్రముఖ హాలీవుడ్‌ స్టార్‌ బిల్‌ డ్యూక్‌ కూడా టాలీవుడ్‌ ప్రముఖులు మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి, తమిళ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌లను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. 
 
అంతర్జాతీయ "స్పై" సినిమా తీయడం గురించి చర్చించుకోవడానికి వారిని లంచ్‌కు ఆహ్వానించారు. 2016లో కోలీవుడ్ హీరో ధనుష్ భార్య ఐశ్వర్యను యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. మహిళల అక్షరాస్యత అభివృద్ధికి సంబంధించి మాట్లాడటానికి బిల్ ఆమెను ఆహ్వానించాడు.
 
'వంశీ పైడిపల్లి, మహేశ్‌బాబు.. మీరు లాస్‌ ఏంజెల్స్‌కు వచ్చినప్పుడు నాతో భోజనం చేయడానికి రండి. అప్పుడు ఇంటర్నేషనల్‌ స్పై సినిమా గురించి చర్చించుకుందాం' అంటూ బిల్‌ ట్వీట్ చేశారు. దీనితో పాటుగా మరో ట్వీట్‌లో ఏ.ఆర్‌.మురుగదాస్‌, మహేశ్‌ బాబులను కూడా సినిమా చర్చలకు ఇన్వైట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

దేశంలోనే తొలి నెట్-జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం- భట్టి విక్రమార్క

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments