Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నమ్మించి గొంతుకోయడం అంటే ఇదేనేమో..?

Advertiesment
నమ్మించి గొంతుకోయడం అంటే ఇదేనేమో..?
, సోమవారం, 29 ఏప్రియల్ 2019 (11:39 IST)
నమ్మించి గొంతుకోయడం అంటే ఇదేనేమో.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువకుడు యువతిని నిలువునా ముంచాడు. నమ్మించి గొంతుకోశాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పులో ఆదివారం సాయంత్రం పెనుమాల మహిత (18) అనే యువతి దారుణ హత్యకు గురైంది. 
 
మాంసం కొట్టే  కత్తితో మెడపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మహిత స్వగ్రామం భీమవరం మండలం కె.బేతపూడి. తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటుండగా…తండ్రి రాంబాబు బీమవరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మహిత మేనమామ ఇంట్లో వుంటోంది. ఇటీవలే కాకినాడలో ఇంటర్ పూర్తి చేసింది.
 
క‌ృష్ణా జిల్లా మైలవరానికి చెందిన మహేష్‌తో మహితకు పరిచయం వుంది. ఆదివారం మహేష్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి మహిత వద్దకు వచ్చాడు. అక్కడ టీ తాగిన అనంతరం ముగ్గురు స్నేహితులు మహిత వదినతో మాట్లాడి బయటకు వెళ్లారు. ఆ తర్వాత మహిత, మహేష్‌లు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ.. గ్రామానికి కిలోమీటరు వరకు నడుచుకుంటూ కాజా సమీపానికి వెళ్లారు. 
 
మాటల మధ్యలో ఇద్దరికి గొడవ మొదలయ్యింది. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో మహేష్.. మహిత మెడపైనా, చేతిపైనా దాడి చేశాడు. ఈ దాడిలో మహిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేష్‌ను అరెస్ట్ చేశారు.
 
సినీ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పిన మహేష్.. ఆమెతో మనస్పర్ధలు ఏర్పడటంతో పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చాడని పోలీసులు తెలిపారు. మహేష్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి?: జగన్మోహన్ రెడ్డి ప్రశ్న