Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి?: జగన్మోహన్ రెడ్డి ప్రశ్న

Advertiesment
రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి?: జగన్మోహన్ రెడ్డి ప్రశ్న
, సోమవారం, 29 ఏప్రియల్ 2019 (11:14 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టనీయకుండా ఏపీ పోలీసులు అడ్డుకోవడంపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. వర్మను అడ్డుకుని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే హైదరాబాద్‌కు పంపించడంపై జగన్ ఫైర్ అయ్యారు. దీనిపై స్పందించిన జగన్ వర్మను ఏపీ పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. 
 
రామ్‌గోపాల్‌ వర్మ ప్రెస్‌ మీట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఆయన చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతాయి, ఇలాంటి వైఖరి గర్హనీయమని ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.
 
ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో ఏపీ సర్కారుపై మండిపడ్డారు. మే ఒకటో తేదీన విడుదల చేసేందుకు నిర్ణయించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విశేషాలను వెల్లడించేందుకు సిద్ధమైన తనను అడ్డుకోవడం ఏమిటని వర్మ ప్రశ్నించారు. తామేమైనా ఉగ్రవాదులమా అని ప్రశ్నించిన ఆయన.. న్యాయపోరాటం తప్పదని స్పష్టం చేశారు.
 
కాగా.. ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించేందుకు వర్మతో పాటు.. మూవీ యూనిట్‌ వచ్చింది. అయితే చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ ప్రకాశ్‌నగర్‌ సెంటర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా వెంటనే హైదరాబాద్‌కు వెళ్లిపోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిబంధనలు పక్కనబెట్టి యూఏఈ జనన ధృవీకరణ పత్రం జారీ